ఐపీఎల్ ఫ్రాంచైజీలకు.. ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?

praveen
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించిన హడావిడి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. వరుసగా మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయ్. ఇక టైటిల్ పోరులో అన్ని టీమ్స్ కూడా తెగ కష్టపడి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే 2008లో ఒక సాదాసీదా టీ20 టోర్నిగా ప్రారంభమైన ఐపీఎల్ ఇక ఇప్పుడు వరల్డ్ క్రికెట్లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఐపీఎల్ లో భాగమైన ఎంతో మంది ఆటగాళ్లకు భారీగా వేతనాలు కూడా చెల్లిస్తూ ఉంటాయి ఫ్రాంచైజీలు. ఇక ప్రైజ్ మనీ కూడా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా ఐపిఎల్ మొత్తం చూసిన తర్వాత వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఫ్రాంచైజీలకు అసలు ఆదాయం ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అన్న విషయంపై మాత్రం చాలామంది కన్ఫ్యూషన్ లో ఉంటారు. అయితే ఈ విషయం ఐపీఎల్ చూస్తున్న దాదాపు సగం మంది ప్రేక్షకులకు తెలియదు అనడంలో సందేహం లేదు.

 కాగా ఐపీఎల్ టీమ్ ఓనర్లకు చాలా రకాలుగా ఆదాయం వస్తుందట. టైటిల్ స్పాన్సర్ సంస్థ ఏడాదికి దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లిస్తే అందులో 50% బీసీసీఐకి.. మిగిలినది మొత్తం ఫ్రాంచైజీలు తీసుకుంటాయట. అలాగే స్పాన్సర్లు క్రెడ్, డ్రీం లెవెల్ లాంటివి బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు చెల్లించే మొత్తంలోనూ సగం టీం ఓనర్లకే వెళుతుందట. అంతేకాకుండా జెర్సీలపై ఉండే లోగోలకు టీం బ్రాండ్ ను బట్టి ఇక ఆదాయం కూడా వస్తూ ఉంటుందట. హోమ్ గ్రౌండ్ టికెట్లలో వచ్చే ఆదాయంలో దాదాపు 80% ఫ్రాంచైజీకే  వెళుతుంది అన్నది తెలుస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా ఆయా ఫ్రాంచైజీ ఓనర్లు ఆదాయం సంపాదిస్తూ ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: