ఐపీఎల్ హిస్టరీలో గ్రేటెస్ట్ కెప్టెన్ ధోని కాదట.. ఎవరంటే?

praveen
ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ పండగ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో భాగంగా వరుసగా మ్యాచ్ లు జరుగుతున్నాయి   ఐపీఎల్ లో పాల్గొంటున్న 10 టీమ్స్ తమ హోమ్ గ్రౌండ్ లలో కూడా మ్యాచ్ లు ఆడుతున్న నేపథ్యంలో.. ఎక్కడ చూసిన ప్రేక్షకులు అందరూ కూడా ఈ టోర్నీలోని ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇండియాలో ఎక్కడ చూసినా ఐపీఎల్ గురించి అందరూ చర్చించుకుంటూ ఉండటం గమనార్హం.

 అదే సమయంలో ఇక ఐపీఎల్ లో హిస్టరీలో ఆయా జట్ల ప్రదర్శన ఆధారంగా అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమ్ ఏది అంతేకాకుండా ఇక అద్భుతమైన కెప్టెన్సీ తో అదరగొట్టిన ఆటగాడు ఎవరు అన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారిపోతూ ఉంటాయి. అయితే అందరికీ తెలిసిన ప్రకారము ఐపిఎల్ లో గ్రేటెస్ట్ కెప్టెన్  ఎవరు అంటే అటు మహేంద్ర సింగ్ ధోనితో పాటు రోహిత్ శర్మ పేర్లు  వినిపిస్తాయి   ఎందుకంటే ఇద్దరు జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యారు.

 తమ టీమ్స్ కి ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ కూడా అందించారు అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు అంటే మాత్రం చెప్పడం కష్టం. కాగా ఇటీవల క్రిక్ ట్రాకర్ అనే పేజీ నిరూపించిన ఫోల్ లో ఐపీఎల్ గ్రేటెస్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ధోని ఈ పోల్ లో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. మొత్తం ఎనిమిది మంది పేర్లతో ఈ పోల్ నిర్వహించారు. ధోని, రోహిత్, గంభీర్, వార్నర్, వార్న్, కోహ్లీ, గిల్ క్రిస్ట్,  విలియంసన్ పేర్లను ఇందులో పొందుపరచగా ఇక రోహిత్ వీళ్ళ అందరిలో కెల్లా బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: