కూటమి కొంపముంచుతున్న బీజేపీ?

Purushottham Vinay
బీజేపీతో చాలా ఇష్టంగా పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. అయితే అదే ఇప్పుడు టీడీపీ కొంప ముంచుతోందా అంటే అవునని తెలుస్తుంది. అసలు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి ఏపీలో ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీటు ఇవ్వడం కంటే వల్లమాలిన ఆలోచన వేరేది ఉండదని తెలుస్తుంది.వ్యవస్థలు తమకు అనుగుణంగా సహకరించేలా చూసేందుకే పొత్తు అంటే ఈ రోజుకీ అది జరగడం లేదు అన్నది టీడీపీ శిబిరంలో వినిపిస్తున్న మాట. ఈ రోజు కూడా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే దర్జాగా పనిచేస్తోందని  వాపోతున్నారు. ఏపీలో అధికారుల నుంచి అందరూ తమ మాట ఎక్కడా వినడం లేదన్న బాధ ఉంది.కీలక ప్లేస్ లలో పోస్టింగులు కొత్తవి వేయాలని ఉన్న వారిని బదిలీ చేయాలని గత పదిహేను రోజుల నుంచి కూడా డిమాండ్ల మీద డిమాండ్లు పెడుతూంటే కూడా పట్టించుకోలేదని తెలుస్తుంది. ఇక వీటికి పరాకాష్ట అన్నట్లుగా గాజు గ్లాస్ గుర్తుని కూడా ఫ్రీ సింబల్ గా చేయడం జరిగింది. అది టీడీపీ కూటమి విజయావకాశాలను ఖచ్చితంగా భారీగా దెబ్బ తీసేలా ఉందని తెలుస్తుంది.దీంతో బీజేపీ మీద టీడీపీ మంట మాములుగా లేదని సమాచారం తెలుస్తుంది.


ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఏమి జరుగుతోంది. కూటమి కడితే ప్రయోజనం ఏమిటన్న చర్చ తమ్ముళ్ల నుంచి పెద్ద నేతల దాకా మొదలైందని తెలుస్తుంది.బీజేపీ నుంచి అనుకున్న సహాయం అందడం లేదని బాధ కూడా ఉందట. పోలింగ్ కి ఇంకా కేవలం 13 రోజులు మాత్రమే టైం ఉంది. ఇది అతి తక్కువ టైం. చాలా విలువైనది. ఈ టైం లో అయినా బీజేపీ దారికి వచ్చి కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే పొత్తు పెటాకులే తప్ప ఉపయోగం ఏమిటని అంటున్నారు.ఏపీలో కూటమి ప్రచార భారం అంతా కూడా  చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ మాత్రమే చూసుకుంటున్నారు. కనీసం బీజేపీ నుంచి అగ్ర నేతలు వస్తారని చూసినా అది కూడా జరగలేదు.ఇక కూటమి తరఫున మ్యానిఫేస్టోని మోడీ చేతుల మీద అవిష్కరిద్దామని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మోడీ ఏపీ పర్యటన వరసబెట్టి వాయిదా పడుతుండడంతో కేవలం చంద్రబాబు, పవన్ మాత్రమే ఆవిష్కరిస్తున్నారు.బీజేపీ ఏపీ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటేనే తప్ప కూటమి లో ఐక్యత కనిపించేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: