నా ఇష్టం అంటున్న మలయాళ బ్యూటీ...!!

murali krishna
ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.యు. మోహనన్‌ కుమార్తె మాళవిక మోహనన్‌.మలయాళ చిత్రం 'పట్టం పోలే' (2013)తో తెరంగేట్రం చేశారు. విక్రమ్‌తో కలిసి నటించిన పాన్‌ ఇండియా చిత్రమే 'తంగలాన్‌. 'పేట', 'మాస్టర్‌', 'మారన్‌' వంటి డబ్బింగ్‌ చిత్రాలతో టాలీవుడ్‌ ఆడియన్స్‌ను పలకరించిన ఆమె నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రం 'రాజాసాబ్‌'.ప్రభాస్‌ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు.నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చి, సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాలని ప్లాన్‌ చేసుకుంటున్న నటి మాళవిక మోహనన్‌. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తంగలాన్ లో నటిస్తుంది.ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ లుక్స్‌తో నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది.మాళవిక మోహనన్ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌-మారుతి కాంబోలో వస్తున్న హార్రర్ కామెడీ ప్రాజెక్ట్‌ రాజాసాబ్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది.సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. తాజాగా ఈ భామ అస్క్ మాళవిక సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఫాలోవర్లు, అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. మీకు ఎలాంటి డ్రీమ్‌ రోల్‌లో నటించాలని ఉందని ఓ నెటిజన్‌ అడిగాడు. దీనికి మాళవిక స్పందిస్తూ.. నేను గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటించాలనుకుంటున్నా. ఓ యువతిని కూల్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. నిజమేనా..? ఇప్పుడు నేను యాక్షన్‌ సీక్వె్న్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నా. యాక్షన్‌ పార్టుకు సంబంధించి నన్ను మరింత ఎలివేట్ చేసుకోవడం ఫన్‌గా ఉంటుందని పోస్ట్ చేసింది మాళవిక మోహనన్‌.తంగలాన్ లోని తన పాత్రలో స్వయంగా డబ్బింగ్ చెప్పినట్లు తెలిపింది.ఎక్కువగా గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తుంటారు ఎందుకని అడగ్గా.. ఇష్టం కనుకే ఆ ఫోటోషూట్స్ చేస్తుంటానని తెలిపింది. అలాగే తన ఫస్ట్ సెలబ్రెటీ క్రష్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అని చెప్పుకొచ్చింది.అలాగే పెళ్లెప్పుడు అని ఓ నెటిజన్ అడగ్గా.. నా పెళ్లి చూసేందుకు నువ్వెందుకు అంత తొందరపడుతున్నావ్ అంటూ కౌంటరిచ్చింది. అలాగే గ్లామర్ షో కాకుండా నటించటం ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్ అని అడిగాడు మరో నెటిజన్.ఇందుకు మాళవిక స్పందిస్తూ.. చేయను.. నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా ?.. అంటూ గట్టిగానే రియాక్ట్ అయ్యింది మాళవిక. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: