తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారు నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు సక్సెస్ సాధిస్తాయి. అందులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటాయి. ఇప్పటివరకు దిల్ రాజు కెరీర్ లో డిజాస్టర్ సినిమాలు పెద్దగా లేవని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి చాలామంది చెడుగా మాట్లాడతారని కానీ పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చారని దిల్ రాజు అన్నారు.
గత ప్రభుత్వం ఉన్నప్పుడు సాయం అడగడానికి చాలా భయపడాల్సి వచ్చేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ కి పక్కింటికి వెళ్లి వచ్చినట్టుగా వెళుతున్నారని తెలియజేశాడు. ఓ అప్లికేషన్ లేదా ఫోన్ కాల్ చేస్తే చాలు సినిమా టికెట్ల ధరలు ఒకసారిగా పెరిగిపోతున్నాయని అన్నాడు. అంతేకానీ ప్రొడ్యూసర్లు అందరూ కలిసి యూనిటీగా కలవాలి మాట్లాడాలి అనే ఆలోచన లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని కానీ అంత ధైర్యం ఎవరికీ లేదని అన్నారు.
సినిమా వాళ్ళకు రెండు ప్రభుత్వాలు చాలా ముఖ్యం. అనవసరంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాపై వివాదం వెళ్ళింది. ఆ వివాదాన్ని యూనిటీగా పరిష్కరించాలని ఎవరు అనుకోవడం లేదంటూ దిల్ రాజు చెప్పారు. థియేటర్లు మూసివేస్తామని వస్తున్న వార్తలపై ఎలాంటి నిజం లేదు. ఈ విషయంపైన మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ నాకు ఫోన్ చేస్తే థియేటర్ల మూసివేత ఏమీ లేదని చెప్పాను. జూన్ నెలలో పవన్ కళ్యాణ్ తో సహా మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతాయని రాజు అన్నారు. పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ కోసం ఎంతో మేలు చేశాడు. వ్యక్తిగతంగా తప్పితే చాంబర్ ద్వారా ప్రభుత్వాన్ని కలవాలని అనుకోవడం లేదని అన్నాడు.
అంతేకాకుండా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే పైరసి వచ్చిందని అన్నారు. అంతే కాకుండా నిర్మాతనే కావాలని పైరసీ చేసి ఉంటారని ఓ మాజీ ప్రొడ్యూసర్ అన్నారు. ఇది చాలా నీచం అంటూ దిల్ రాజు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక నిర్మాతగా నా సినిమాను నేను కాపాడుకుంటాను. అంతేకానీ పైరసీ ఎందుకు చేస్తానని దిల్ రాజు ప్రశ్నించాడు. తెలంగాణలో ఉన్న 370 థియేటర్లలో కేవలం 30 థియేటర్లు మాత్రమే తనకు సంబంధించినవని దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం దిల్ రాజు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి.