ఏపీ పిఠాపురం: చిన్న చూపా అంటూ సంచలన ట్వీట్ చేసిన వర్మ..!
అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఉన్నారు.. పవన్ సీటు కోసమే వర్మ తన సీటును పిఠాపురంలో త్యాగం చేశారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ హామీ ఇవ్వడంతో ఇచ్చేసిన వర్మ ఆ తర్వాత వర్మ కళను నెరవేర్చలేదు. అయితే వర్మ మాత్రం ఎక్కడ వెనకడుగు వేయకుండా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఇటీవలే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తో కలిసి పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన వర్మకు ఒక అవమానం జరిగిందట.
వర్మ పైన పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు ,రైతులకు వ్యవసాయ సామాగ్రిని కూడా పంచారు. దీంతో వర్మ అక్కడికి వస్తున్న క్రమంలో పోలీసులు విఐపిలకు అనుమతి లేదంటూ కూడా అడ్డుకున్నారట. అలా వర్మ పోలీసుల మధ్య కొంతమేరకు వార్ కూడా జరిగింది. దీంతో వర్మ తన ట్విట్టర్ నుంచి రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నట్టుగా ఒక జిల్లా అధికారి భ్రమలో ఉన్నారని టిడిపి పార్టీ జెండా అంటే అంత చిన్న చూపా అంటూ.. క్రమశిక్షణతో భరిస్తున్నామని ట్విట్టర్ నుంచి తెలిపారు. ఈ ట్విట్ పైన పలు రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు.