ఏపీ: ఫీడ్ బ్యాక్ లో చంద్రబాబుకు షాకింగ్ విషయాలు..అలర్ట్ కావాల్సిందేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎన్నో హామీలను చెప్పి వచ్చినప్పటికీ అలా వచ్చి ఇప్పటికి 10 నెలలు కావస్తూ ఉన్న ఎలాంటి హామీలు నెరవేర్చలేదని ప్రజలు కూడా కూటమిపైన కొంతమేరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ అసహనం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నది ప్రజలలో. ఎన్నికల ముందు ఏవేవో హామీలతో ఊదరగొట్టి ఆ తర్వాత మేనిఫెస్టోలో చెప్పిన వాటి అంశాల పైన ఫోకస్ పెట్టకుండా ఉండడంతో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూటమినేతలను సీఎం చంద్రబాబును కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు.



ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ఫీడ్ బ్యాక్ తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి ఒక షాకింగ్ తగిలినట్లుగా తెలుస్తోంది. అసలు కూటమి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదంటూ చాలా మంది ప్రజలు విసిగిపోతున్నారట. కేవలం సామాజిక పెన్షన్స్, రెవెన్యూ సర్వీస్, పోలీస్ సేవలు ,ఆరోగ్య సేవలు విషయంలో పలు రకాల ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక పెన్షన్ పెంపు విషయంలో కొంతమేరకు బాగానే ఉన్న లంచం అడుగుతున్నారని ఫీడ్ బ్యాక్ వచ్చిందట.

ఇక డ్రగ్స్ కట్టడి విషయంలో పోలీసులు విఫలమయ్యారని.. అలాగే ఉద్యోగుల పనితీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువైందని.. ఫీడ్ బ్యాక్ అందుకున్నారట. ఇక రెవెన్యూలో కూడా ఎక్కువగా లంచాలు తీసుకుంటున్నారనే విధంగా ఫీడ్ బ్యాక్ వచ్చిందట. రీ సర్వేలో ప్రస్తుతం ఎక్కువగా జరుగుతోందట.ఆరోగ్య సేవలు అందించడంలో కొంతమేరకు బాగానే ఉన్నదట.. ఇక సంక్షేమ పథకాల విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందనే విధంగా చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారని అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ తో కొంతమంది ఆనందంగా ఉన్నారని, ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏపీ అంతట ఊంచాలని ఫీడ్బ్యాక్ ఎక్కువగా వినిపిస్తోందట. వీటికి తోడు రీ సర్వే భూములన్ని క్యాన్సిల్ చేస్తానని చెప్పిన ఇప్పటివరకు వాటి గురించి ఏమి చెప్పలేదు. నిరుద్యోగులను కూడా మోసం చేశారనే విధంగా నిరుద్యోగులు మాట్లాడుతున్నారట. మొత్తం మీద గుడ్ కంటే బ్యాడ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా ఉందట. మరి ఇకనైనా సీఎం చంద్రబాబు వీటి మీద దృష్టి పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: