
వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్ ?
వల్లభనేని వంశి బయటకు రాకుండా ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఇప్పుడు ఆయన ప్రధాన అనుచరిని కూడా అరెస్టు చేశారు. గన్నవరం టిడిపి పార్టీ కార్యాలయం పై దాడి చేసిన నిందితులలో... కీలక వ్యక్తి రంగా అని తెలుస్తోంది. టిడిపి పార్టీ కార్యాలయం పై దాడి చేసిన నిందితులలో A1 గా వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రంగ అరెస్టుతో... ఈ మధ్యకాలంలో నమోదు అవుతున్న కేసులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారట.
వల్లభనేని వంశీకి కుడి భుజంగా వోలుపల్లి మోహన రంగా వ్యవహరిస్తున్నారు. అటు సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఇవాళ వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా వల్లభనేని వంశీకి మేలు వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా... వల్లభనేని గత నెలలోనే అరెస్టయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా వల్లభనేని వంశీ జైలులో ఉంటున్నారు.
ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు వల్లభనేని వంశీ పై నమోదు అవుతోంది. టిడిపి పార్టీ నేతలు టార్గెట్ చేసి మరి వల్లభనేని వంశీ పై కేసులు పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.... టిడిపి నేతలపై రెచ్చిపోయిన వారికి టార్గెట్ చేసి... కేసులు పెడుతున్నారు. అలా ఇప్పటికే పోసాని కృష్ణ మురళి, బోరుగడ్డ అనిల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అరెస్టు అయ్యారు.