
రేవంత్ రెడ్డి మండిపాటు.. ఆ ఎమ్మెల్యేకు సీరియస్ వార్నింగ్..?
ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సమావేశం మధ్యలో బయటకు వెళ్లడం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమైందని సమాచారం. ఒకవైపు సీఎం అంత సీరియస్‌గా మాట్లాడుతుంటే, ఎమ్మెల్యే జయవీర్ లేచి వెళ్లడం ఏమిటని రేవంత్ రెడ్డి నిలదీసినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయాలను ఆటలా వద్దు, ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ పట్ల కొందరు ఎమ్మెల్యేలు మెతక వైఖరితో ఉన్నారని, దానివల్ల రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవచ్చని భావిస్తున్నారేమోనని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గురించి తక్కువ అంచనా వేయవద్దని, రాజకీయాలు అంత సులభం కాదని ఆయన ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా, చాలామంది ఎమ్మెల్యేలు సీరియస్‌గా పనిచేయడం లేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కసారి గెలవడం గొప్ప కాదని, మళ్లీ గెలవడమే అసలైన విజయమని ఆయన హితవు పలికినట్లు తెలుస్తోంది. అందరూ కలిసికట్టుగా పనిచేయకపోతే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, అది పార్టీకి నష్టం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇకనుంచి ఎమ్మెల్యేలంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, ప్రజల్లో ప్రభుత్వ పథకాలను, పార్టీ విధానాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి, పనితీరుపై సమీక్ష చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారని, పనితీరు మెరుగుపర్చుకోకపోతే చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.