2 లక్షల పుస్తకాలు చదివిన మేధావి.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?
జోక్ ఏంటంటే, ఏపీ మాజీ సీఎం జగన్ ఆల్రెడీ పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకొచ్చారు. వాలంటీర్ల రూపంలో ఉప్పు, పప్పు, బియ్యం నుంచి అన్ని సేవలను ప్రజల ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ కూడా తనకి అదే కావాలని కోరుకుంటున్నట్టు ఇప్పుడు చెప్తున్నారు కానీ వాలంటీర్ వ్యవస్థని ఆపింది ఎవరు? పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు టీమే కదా? ఇప్పుడు పవన్ ఏమంటున్నారు.. ఉద్యోగులు సరిగా పనిచేయట్లేదు, అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా వరస్ట్ గా మారిందని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యోగులు పని చేయారని చెప్పే జగన్ సచివాలయం అంటూ కొత్త వ్యవస్థలను తీసుకొచ్చారు.
చాలామంది వాలంటీర్లను హైర్ చేసుకుని ప్రజలకు సేవలు అందించారు. ఇప్పుడు వారిని పక్కన పెట్టి మళ్ళీ ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకెళ్లాలని అనడం తెలివి తక్కువ పని కాదా అని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి లాజిక్ మిస్ అయిన మీరు ప్రభుత్వాన్ని ముందుకు నడిపించినట్లే అని ఎద్దేవా చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. పవన్ కి అంత తెలివే ఉంటే చదువుల్లో ఎందుకు ఫెయిలవుతాడు అని కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రెండు లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అబ్బా అంటూ ఆట పట్టిస్తున్నారు.