కేసీఆర్‌ స్కెచ్‌: ఓవైసీ బ్రదర్స్‌ ఇక రాజకీయ సన్యాసమే ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో ఓవైసి బ్రదర్స్ పరిస్థితి దారుణంగా తయారయింది. గత పది సంవత్సరాల గులాబీ పార్టీ పాలనలో... కెసిఆర్ వెనుక నడిచారు ఓవైసీ బ్రదర్స్. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాలపాటు... ఆయన ఏది చెబితే అది... అన్నట్లుగా ఓవైసీ పార్టీ నడిచిన సంగతి తెలిసిందే. కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు ఆమోదం తెలిపారు. గులాబీ పార్టీకి అడుగడుగునా ఎంఐఎం పార్టీ.. మడుగులొత్తింది.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా... గులాబీ పార్టీకి సపోర్ట్ ఇచ్చి.. మేయర్ అయ్యేలా ప్లాన్ చేసింది ఎంఐఎంఏ. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో... ఓవైసీ పార్టీ ప్లాన్ మార్చింది. కెసిఆర్ పార్టీకి గుడ్ బై చెప్పి...  ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తిరుగుతోంది ఓవైసీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇన్ డైరెక్ట్ గానే.. కాకుండా చాలాసార్లు డైరెక్ట్ గా మద్దతు కూడా ఇచ్చింది ఓవైసీ పార్టీ.

తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి... కచ్చితంగా ఓవైసీ సపోర్ట్ చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో...  కాంగ్రెస్ పార్టీకి అడుగడుగున అండగా నిలిచింది మజిలీస్ పార్టీ. నమ్మిన బంటుగా కాంగ్రెస్ పార్టీకి.. పనిచేసిన ఏకైక పార్టీ ఓవైసీదే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత...  కాంగ్రెస్ పార్టీ కనుమరుగే ప్రమాదం ఉందని గ్రహించి... కెసిఆర్ కు జై కొట్టారు.
అయితే ఇప్పుడు అదే... ఎంఐఎం పార్టీ కొంప ముంచేలా కనిపిస్తోంది.  ఎంఐఎం పార్టీకి అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ.. వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల దగ్గర వస్తున్న నేపథ్యంలో.. ఎంఐఎం పార్టీని దూరం పెట్టిందట కాంగ్రెస్. తెలంగాణలో వ్యవహరించిన తీరును బట్టి... కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందట. గతంలో కేసీఆర్కు అనుకూలంగా ఉన్న ఎంఐఎం పార్టీని దూరంగా పెట్టాలని... సోనియా గాంధీ కూడా నిర్ణయం తీసుకున్నారట. అలా కేసీఆర్ వల్ల ఇప్పుడు ఎంఐఎం పార్టీ... ప్రమాదంలో పడ్డట్టు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: