బాబును అంచనా వేసిన కేకే.. బిజెపి విషయంలో మాత్రం బోల్తా పడ్డారుగా?

praveen
సాధారణంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అయితే 2024 ఏపీ అసెంబ్లీ  ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ సంచలనమే రేపాయ్. అయితే ఎగ్జిట్ పోల్స్ కొన్ని కొన్ని సార్లు ఎగ్జాక్ట్ పోల్స్ గా మారిపోతూ ఉంటాయి   ఇక ఏపీ అసెంబ్లీ ఫలితాలు విషయంలో కేకే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్స్ గా మారిపోయాయి. ఏకంగా కూటమికి 160 కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని కేకే సర్వే సంస్థ అధిపతి కిరణ్ చెప్పారు.

 ఇదే నిజం అయింది కూడా. దీంతో కూటమి నేతలు ఆయనను సన్మానించిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఇక ఏ ఎలక్షన్స్ జరిగిన కేకే సర్వే రిపోర్ట్ కి ప్రాముఖ్యత పెరిగిపోయింది. కానీ ఏపీ ఫలితాలను ఎగ్జాక్ట్ గా అంచనా వేయగలిగిన కేకే.. అటు హర్యానా ఎన్నికల విషయంలో మాత్రం బొక్క బోర్లా పడిపోయారు. ఎందుకంటే కేకే సర్వే చెప్పింది ఒకటి అసలు ఫలితాలలో వచ్చింది ఒకటి అన్న విధంగా మారింది పరిస్థితి. హర్యానాలో బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేదని.. కేకే సర్వే అంచనా వేసింది. చివరికి బిజెపిని హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో టైటానిక్ షిప్ తో పోల్చారు ఆయన.

 ఇదే నిజమవుతుందని కూడా చాలామంది నమ్మారు. కానీ కేకే సర్వే వెల్లడించిన ఎగ్జిట్ ఫలితాలు పూర్తిగా తప్పని ఎగ్జాక్ట్ ఫలితాలు తేల్చి చెప్పేశాయి. ఎందుకంటే భారీ మెజారిటీ సాధిస్తుంది అని చెప్పిన..  కాంగ్రెస్ 34 సీట్ల ఆదిక్యంలో కొనసాగుతుంటే.. ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి దూసుకుపోతుంది. ఏపీ ఫలితాల విషయంలో ఎగ్జాక్ట్ గా కేకే అంచనా వేయడంతో.. హర్యానా ఫలితాల విషయంలో కూడా అదే జరుగుతుందని అందరూ అనుకున్నారు. చివరికి కేకే సర్వే ఫెయిల్ అయింది. దీంతో ఇక ఈ ఫలితాలతో కేకే సర్వే అధినేత ఏం చెబుతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kk

సంబంధిత వార్తలు: