జనసేన: డిప్యూటీ సీఎంకు ఏపీ పరిస్థితి అర్థమయిందా.. అందుకే అలా..!
యువతలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కళ్యాణ్ జనసేన ఓట్లగా 2024 ఎన్నికలలో మార్చుకున్నారు. ఈ ఎన్నికలలో ఒక ట్రెండ్ సెట్ చేసిన జనసేన పార్టీ గురించి ఒక న్యూస్ అయితే వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన టాప్ టు బాటమ్ అందరూ కూడా చాలా సైలెంట్ గానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు వరకు దూకుడు చూపించిన జనసేన పార్టీ నేతలు నాయకుడు ఇప్పుడు సైలెంట్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ని ఉన్నత స్థాయిలో చూడాలని బలంగా కోరుకున్న నేతలు , కార్యకర్తలు అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా అయితే దక్కింది.
కానీ అధికారంలో కూటమిలో భాగంగా వచ్చిన జనసేన సైనికుల మధ్య హుషారు అనేది కనిపించడం లేదట. ఈ విషయం అటు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఆలోచించాల్సిన విషయమే అని చెప్పవచ్చు. గతంలో జగన్ కూడా కార్యకర్తలని పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తప్పు చేస్తున్నారనే విధంగా పలువురు నేతలు కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. జనసేన పార్టీని నమ్ముకుని పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు సర్వస్వం ధారపోసి మరి పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. వీటికి తోడు టిడిపి నేతలు కూడా వీరిని ఎలాంటి వాటికి పిలవడమే కాకుండా దూరం పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా వైసిపి పార్టీ నుంచి వచ్చిన వారికే అన్ని ఇస్తున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏపీ ని వదిలేసి ఎక్కువగా హైదరాబాదులోనే తన సమయాన్ని గడుపుతున్నారట. మొదట్లో జనసేన పార్టీల నుంచి ఇద్దరు మంత్రులు బాగానే చేసిన ఈ మధ్య అసలు కనిపించడం లేదట. దీన్ని బట్టి చూస్తే ఏపీ పరిస్థితి డిప్యూటీ సీఎంకు అర్థమయిందా అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చాలా హామీలు ఇవ్వడంతో అవి నెరవేరుస్తారో లేదు అనే సందేహం కూడా మొదలైనట్లు సమాచారం.