రాహుల్ నాలుక కోస్తే 11 లక్షలు ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అతి త్వరలోనే జరగనున్న నేపథ్యంలో... ఆ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాలుక కోస్తే 11 లక్షలు ఇస్తానని శివసేన ఎమ్మెల్యే బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే తాజాగా శివసేన ఎమ్మెల్యే... చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా హార్ట్ టాపిక్ అయింది. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హడావిడి స్పష్టంగా ఆ రాష్ట్రంలో మనకు కనిపిస్తోంది.
ఎన్నికల తేదీలు ఇంకా ఖరారు కాకముందే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. ఈసారి ఎలాగైనా శివసేన పార్టీ అధికారంలోకి రావాలని... ఏక్ నాథ్ సండే వర్గం ప్రయత్నాలు చేస్తోంది. అటు అసలు సిసలు శివసేన పార్టీ నేతలు.. బిజెపిని అధికారంలోకి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే... కాంగ్రెస్ అగ్ర నేత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ పై.. మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది.
రాహుల్ గాంధీ నాలుగే కోసిన వారికి 11 లక్షలు ఇస్తానని... బహిరంగ ప్రకటన చేశారు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం అమెరికా టూర్ లో రాహుల్ గాంధీ ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలో రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా సంజయ్ గైక్వాడ్... కౌంటర్ ఇవ్వడం జరిగింది. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రిజర్వేషన్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది.
అయితే దీనిపై సంజయ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆలోచన చేస్తున్న రాహుల్ గాంధీ నాలుక కత్తిరించాలని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఎప్పుడు రాజ్యాంగ పుస్తకాన్ని.. పట్టుకుని తిరగడం తప్ప ఆ రాజ్యాంగాన్ని గౌరవించడం తెలియదన్నారు. ఇలాంటి నాయకులు దేశ రాజకీయాల్లో ఉండడం అవసరం లేదన్నారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే మళ్లీ భారతదేశం 400 ఏళ్ళు వెనక్కి పోతుందని బాంబు పేల్చారు సంజయ్ గైక్వాడ్. కాబట్టి ఇకపైన కాంగ్రెస్ నేతలకు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకూడదని కోరారు.