ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ.. ఆ తప్పు చేయకుండా బాబు జాగ్రత్త పడతారా?
వైసీపీ పాలనలో జల వనరులను ఆక్రమించి భారీగా చేపట్టిన నిర్మాణాల వల్లే వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తుతోందని ఆయన తెలిపారు. అక్రమ నిర్మాణాల తొలగింపుతో భవిష్యత్తులో బెజవాడ తరహా విపత్తులు రాష్ట్రంలో రిపీట్ కావని ఆయన అన్నారు. ఈ తరహా ఆక్రమణాల విషయంలో ఏ పార్టీకి చెందిన వాళ్లైనా ఉపేక్షించే అవకాశమే లేదని ఆయన తెలిపారు. పేదల నిర్మాణాల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తొలగిస్తామని నారాయణ వెల్లడించారు.
అక్రమ నిర్మాణాల వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు వరదలతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. దీన్ని ఉపేక్షించేది లేదని బెజవాడలో ముంపు సమస్య తలెత్తకుండా టీడీపీ హయాంలో ప్రారంభించిన వరద నీటి ప్రవాహ ప్రాజెక్ట్ పనులను వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. అక్రమ నిర్మాణాలకు లైసెన్స్ లు ఇచ్చి ప్రోత్సహించిందని ఆయన పేర్కొన్నారు.
ఇకపై ఆక్రమణలకు సంబంధించి పట్టణ ప్రణాళిక అధికారులను బాధ్యుల్ని చేయబోతున్నామని ఈ విభాగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధ్యయనం కోసం అధికారులను 15 రాష్ట్రాలకు పంపామని నారాయణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బెజవాడలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు. వైసీపీ నిర్ణయాలే విజయవాడ పాలిట శాపం అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. నారాయణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేద ప్రజలకు అన్యాయం జరగకుండా చంద్రబాబు జాగ్రత్త పడతారేమో చూడాలి. చంద్రబాబు ఏపీ ప్రజలకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.