* ఉద్యమకారులను దూరం పెట్టిన కేసీఆర్
* ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం
* మేడిగడ్డ కుంగి పోవడం
* ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిగా ముద్ర
కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ... రాష్ట్ర సాధకుడిగా మిగిలిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు వచ్చిన కూడా... ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. కానీ కెసిఆర్ వల్ల మాత్రం ఇది సాధ్యమైంది. ఈ తరుణంలోనే 10 సంవత్సరాల పాటు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణలో అధికారం వచ్చింది. దీంతో 10 సంవత్సరాల పాటు ఒక రాజుల.. కెసిఆర్ తెలంగాణను ఏలారు.
అయితే 10 సంవత్సరాల కాలంలో... తెలంగాణ బ్రాండ్ ను అమాంతం పెంచేశారు కేసీఆర్. హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దారు. అయితే మంచి పనులు చేసిన కేసీఆర్ అదే సమయంలో చాలా వరకు పెద్ద పెద్ద మిస్టేక్స్ చేశారు. దీంతో... చనిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కొన్ని స్వయం కృప రాధ తప్పిదాల వల్ల కేసీఆర్ ప్రభుత్వం దిగి పోవాల్సి వచ్చింది.
ముఖ్యంగా ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పై పెద్ద మచ్చ పడిన సంగతి తెలిసిందే. ప్రతిసారి ఫామ్ హౌస్ లో తప్ప.. ప్రజల మధ్యలో ఎప్పుడు కెసిఆర్ ముఖ్యమంత్రిగా కనిపించలేదు. అలాగే తెలంగాణ ఉద్యమకారులను, ఉద్యమ సమయంలో కేసీఆర్ కు సహాయపడిన నేతలను దూరం పెట్టారు. అంతేకాకుండా... నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రావడం జరిగింది. నీళ్లు అలాగే నిధుల విషయంలో కేసీఆర్ సక్సెస్ అయిన నియామకాలలో... అట్టర్ ఫ్లాఫ్ అయ్యారని ఒక... వాదన జనాల్లోకి వెళ్ళింది.
కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాటిని జనాల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టినా కూడా... మేడిగడ్డ ఎన్నికల కంటే ముందు కుంగడంతో... కెసిఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. కానీ మొన్నటి వర్షాలకు మేడిగడ్డకు ఏమీ కాలేదు. చాలా బలంగా దృఢంగా మేడిగడ్డ ప్రాజెక్టు నిలవడం జరిగింది. అయితే ఎన్నికల కంటే ముందు ఈ ప్రాజెక్టుపై స్వయంగా కేసీఆర్ వివరణ ఇచ్చి ఉంటే... మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేవారు. అలాగే.. మొదటి ఐదు సంవత్సరాలలో ఎమ్మెల్యేల పైన... కన్ను వేసిన కేసీఆర్ ఆ తర్వాత.. 5 ఏళ్లలో... పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారు.ఇలా అనేక కారణాలవల్ల కెసిఆర్ దిగిపోవాల్సి వచ్చింది.