ఏపీ: చిత్తూరులో ఘోర బస్సు ప్రమాదం...భారీగా మృతుల సంఖ్య..!

FARMANULLA SHAIK
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రెండు లారీలను బస్సు ఢీకొంది.ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళుతుండగా మొగిలి ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ రోడ్డు ప్ర‌మాదం లో పలువురు ప్రయాణికులు మృతి చెంద‌డం పై సీఎం చంద్ర‌బాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఆరా తీసిన ఆయన సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు.మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.బాధిత కుటుంబాల‌ను ప్రభుత్వం ఆదుకుంటుందని అని తెలిపారు.చిత్తూరు జిల్లాలోని మొగిలిఘాట్‌ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరోలారీ కూడా ఉందని తెలిసింది. ఇక రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఇతర వాహనదారులు పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు.దాంతో వెంటనే సహాయక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని బస్సులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తున్నారు.ఎనిమిది మంది మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు.పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.మరో వైపు ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా రవాణా శాఖ పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు.ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబాలకు సంతాపం తెలిజేసిన చంద్రబాబు నాయుడు గారు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: