బుస కొట్టిన బుడమేరు... విజయవాడ అల్లకల్లోలం ?
* 48 మంది వరదలకు మృతి
* బుడమేరుతో... ప్రమాదంలో పడ్డ విజయవాడ
* పది రోజులుగా కరెంటు లేని పరిస్థితి
* కోట్లలో పంట అలాగే ఆస్తి నష్టం
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత శనివారం నుంచి... భయంకరంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో విజయవాడ మహానగరం, అటు తెలంగాణలోని ఖమ్మం ప్రాంతంలో వరదలు.. ప్రమాదకరంగా వచ్చాయి. పొద్దున లేవగానే ఇండ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. ఎక్కడి జనాలు అక్కడే చిక్కుకుపోయారు. పశువులు అలాగే జంతువులు వరదలకు కొట్టుకుపోయాయి. రైతుల బాధలు ఇక చెప్పలేనివి.
కానీ అక్కడ పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదని సమాచారం. ఆర్మీ రంగంలోకి దిగినా కూడా.. పరిస్థితి మారడం లేదని తెలుస్తోంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం... విజయవాడ వరద బాధితులను మాత్రం చాలావరకు కాపాడాలని చెప్పవచ్చు. ఆయన ఇల్లు మునిగినా కూడా... వరద బాధితుల కోసం 24 గంటలు పనిచేస్తున్నారు. గత పది రోజులుగా చంద్రబాబు నాయుడు అసలు నిద్ర పోలేదని సమాచారం.