వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు షాక్
హైకోర్టు ఈ విషయంపై విచారించింది. ఈ విషయంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డిపై కోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే అక్రమ నిర్మాణాలను ఆపాలని, వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది. అక్రమ కట్టడాలపై ఏపీ హైకోర్టు సూచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. భీమిలి సముద్ర తీరంలో సీఆర్జెడ్ రూల్స్ పాటించకుండా చేపట్టిన నిర్మాణాలను వెంటనే నేలమట్టం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ నిర్మాణం విషయంలో కూాడా తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రకటించింది. కోర్టు ఆదేశాల మేరకు జీవీఎంసీ రంగంలోకి దిగింది.
భీమిలి సముద్ర తీరం వద్ద అనేక అక్రమ నిర్మాణాలు సాగుతున్నట్లు జనసేన కార్పొరేటర్ మూర్తి కోర్టులో పిల్ వేశారు. తీరం వద్ద మూడున్నర ఎకరాలను ఓ కంపెనీ నుంచి కొందరు కొనుగోలు చేసినట్లుగా ఆయన తగిన ఆధారాలు కోర్టుకు ఇచ్చారు. ఆ కొనుగోలు చేసిన వారిలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కూడా ఉన్నారు. దీంతో సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టినందుకు ఆమెపై కోర్టు చర్యలు తీసుకోనుంది. ఈ విషయంపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. నేహారెడ్డి విషయంలో కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పలువురు నినాదాలు వినిపిస్తున్నారు. ఏదేమైనా కోర్టు మంచి తీర్పు ఇచ్చిందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి వైసీనీ నేతలకు దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడటం ఖాయమని జనసేన నేతలు కౌంటర్ ఇస్తున్నారు.