వైసీపీ వర్సెస్ టీడీపీ: కృష్ణలంక రిటైనింగ్ వాల్ క్రెడిట్ ఎవరిది?
* కృష్ణలంకను కాపాడుతున్న రిటైనింగ్ వాల్
* జగన్ ప్రభుత్వంలో ప్రారంభం అయిన రిటైనింగ్ వాల్
* విజయవాడ వరదలకు తట్టుకున్న రిటైనింగ్ వాల్
* టీడీపీ ప్రభుత్వంలోనే రిటైనింగ్ వాల్ పునాది అంటూ ప్రచారం
అయితే విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తిన నేపథ్యంలో... కృష్ణలంక రిటైనింగ్ వాల్ గురించి ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. కృష్ణలంక వాసుల కోసం రిటైనింగ్ వాల్ కట్టింది జగన్మోహన్ రెడ్డి అని.. వైసిపి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. దానికి తగ్గట్టుగానే ఇడుపులపాయ నుంచి నేరుగా... సోమవారం రోజున కృష్ణలంక ప్రాంతానికి చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి భారీగానే ఆహ్వానం లభించిందని చెప్పవచ్చు.
వాస్తవంగా విజయవాడ నగరానికి భారీ స్థాయిలో వరదలు వచ్చినా కూడా... కృష్ణలంక మాత్రం మునుగలేదు. దీనికి కారణం రిటైనింగ్ వాల్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు.. పూర్తయింది. దీంతో ఆ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసుకుంటున్నది వైసిపి.
కానీ ఈ రిటైనింగ్ వాల్ చంద్రబాబు.. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే... సగం పూర్తి చేసినట్లు టిడిపి ప్రచారం చేస్తోంది. అప్పటి పనులు 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి పూర్తయినట్లు... జోరుగా చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణంగా కృష్ణలంక... బతికి బయటపడిందని వైసిపి చెపుతోంది. కానీ రెండు ప్రభుత్వాల కారణంగా.. రిటైనింగ్ వాల్ పూర్తయిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ క్రెడిట్ రెండు పార్టీలకు దక్కుతుందని కూడా కొంతమంది అంటున్నారు.