బాలీవుడ్ హీరోయిన్ కు వైసీపీ నేతల టార్చర్ ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి నేతల బాగోతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.ఏపీలో వైసిపి పార్టీ ఓటమి పాలు అయిన తర్వాత... ఆ నేతలను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం కూటమి... చాలా ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు కేసులు పెట్టి మరి వైసీపీ నేతలను ఇబ్బందులు పెడుతోంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. అదే సమయంలో వైసీపీ నేతలు చేసిన చాలా తప్పిదాలు కూడా బయటకు వస్తున్నాయి.
ఈ ఇష్యూ ని ఒకసారి పరిశీలించినట్లయితే...ముంబైకి చెందిన ఓ నటిని..విజయవాడకు రప్పించి... ఓ వైసిపి కీలక నేత గెస్ట్ హౌస్ లో బంధించి మరి టార్చర్ పెట్టాడట. వైసిపి నేత అయిన ఓ పారిశ్రామికవేత్త కుమారుడితో... ఆ ముంబై హీరోయిన్ ప్రేమలో ఉందని కూడా సమాచారం. అయితే ఆ బడా వైసిపి నేత కుమారుడి... వ్యవహారం తండ్రికి తెలిసిందట. దీంతో ఆ బాలీవుడ్ బ్యూటీని... మర్చిపోవాలని కొడుకును ఇబ్బంది పెట్టాడట. అయినప్పటికీ వారి వ్యవహారం సద్దుమనగలేదట. దీంతో ఆ బ్యూటీని విజయవాడకు పిలిపించి మరీ టార్చర్ చేశారట. రూమ్లో బంధించి వేదించారట.
ఈ వ్యవహారం అంతా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిందట. అంతే కాదు ఈ వ్యవహారంలో.. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ నేత కూడా.. ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇక ప్రేమ వ్యవహారం, విజయవాడలో జరిగిన ఇష్యూ మర్చిపోవాలని.. ఆ హీరోయిన్ కు 5 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చారట. అయినప్పటికీ ఆ హీరోయిన్ రాజీ పడలేదని సమాచారం. దీంతో ఓ ఐపీఎస్ ఆఫీసర్.. అప్పటి వైసిపి నేతలు చెప్పినట్లుగా విని... సదర్ హీరోయిన్ పై చీటింగ్ కేసు పెట్టారట. వైసిపి నేతలను హనీ ట్రాప్ బ్లాక్ మెయిల్ చేస్తోందని.. ఆమెను ఇరికించారట. ప్రస్తుతం ఈ విషయాన్ని ఎల్లో మీడియా బాగా ప్రచారం చేస్తుంది.