నేరెళ్ల గుండెకోత.. ఇసుకాసురుల దాహానికి బలైన పేదలు.!
- పెట్రేగిపోయిన ఇసుకాసురులు
- దేశవ్యాప్తంగా సంచలనమైన దమనకాండ.!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజలు సుభిక్షంగా బతుకుతారని ఆలోచన చేశారు. అదే తెలంగాణలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాకాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇసుక వ్యాపారులు అమాయకుడైనటువంటి రైతుపై లారీ ఎక్కించేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.
కేటీఆర్ చేయించారా?
రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. 8 సంవత్సరాల క్రితం జూలై 2వ తేదీన తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్లకు చెందిన దళితుడు భూమయ్య మరణించాడు. దీంతో కొపేద్రిక్తులైనటువంటి దళితులంతా ఆగ్రహానికి గురై ఐదు ఇసుక లారీలను తగలబెట్టేశారు. దీంతో పోలీసులకు మరియు స్థానికులకు మధ్య ఉధృత వాతావరణం నెలకొంది. 13 మందిని పై పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. ఈ ఘటనలో జూలై 4 2017 రాత్రి 11.30గంటలకు నేరెళ్ల గ్రామానికి చెందిన చెప్పాలా బాలరాజు, పెంట బాలయ్య, కోల హరీష్, పసుల ఈశ్వర్ కుమార్, గంధం గోపాల్ వంటి మరికొంతమందిని అనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకొని 7వ తేదీన అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వీరిని జూలై8వ తేదీన రిమాండ్ కు తరలించారు. అప్పటికే ఆ బాధితులను చావు దెబ్బలు కొట్టిన పోలీసులు చివరికి కరీంనగర్ జైల్లోకి తీసుకెళ్లారు. ఈ టైంలో జైలర్ శివకుమార్ నిందితులపై ఉన్న గాయాలు చూసి రిమాండ్ కు నిరాకరించాడు. వాళ్లకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఇచ్చి బాగానే ఉన్నారని చెప్పి డాక్టర్ ధ్రువీకరణ తీసుకొని 8న జైలుకు తరలించారు. జైల్లోకి వెళ్లిన తర్వాత నలుగురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు.