శత్రువులు లేకుండా రూట్ క్లియర్ చేస్తున్న లోకేష్ ?
అయితే ఆమెకు ఇది తొలి ఎన్నిక. కానీ టిడిపి కూటమి దాటితే ఆమె ఓడిపోవడం జరిగింది. సామాన్య మామయ్య.. మురుగుడు హనుమంతరావు... ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తల్లి కమల కుమారి కూడా ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అయినా కూడా మంగళగిరిలో లావణ్య జెండా ఎగరలేదు. నారా లోకేష్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది మురుగుడు లావణ్య.
అయితే... ఇప్పుడు మురుగుడు లావణ్య కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మురుగుడు లావణ్య మామయ్య... మురుగుడు హనుమంతరావు సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆయన పార్టీ మారెందుకు సిద్ధమయ్యారట. త్వరలోనే నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరేందుకు హనుమంతరావు... రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చేనేత బ్యాగ్రౌండ్ కు చెందిన హనుమంతరావు.. టిడిపిలో చేరితే తమకు బలం చేకూరుతుందని నారా లోకేష్ అనుకుంటున్నారట.
అంతేకాదు ఇటీవల... నారా చంద్రబాబు నాయుడు చేనేత కార్మికుల కోసం ప్రకటించిన వరాల నేపథ్యంలో... నారా లోకేష్ ను పరోక్షంగా మెచ్చుకున్నారు మురుగుడు హనుమంతరావు. అయితే.. మొన్నటి వరకు ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఉన్న.. నారా లోకేష్ ను... హనుమంతరావు పొగడడం వెనుక... కొత్త చర్చ జరుగుతోంది. హనుమంతరావు త్వరలోనే... పార్టీ మారబోతున్నారని అంటున్నారు. మరి దీనిపై లావణ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.