జగన్ కు బిగ్ షాక్... వైవి సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరు ఎంపీలు జంప్?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. పార్టీకి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత... వైసీపీని టార్గెట్ చేసి రకరకాల.. చర్యలకు పాల్పడుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో.. జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ పార్టీ కార్యాలయాలను కూల్చే దిశగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. అలాగే వైసిపి లో ఉన్న ఫైర్ బ్రాండ్ నేతలపై కూడా కేసులు పెడుతోంది. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి.. సొంత పార్టీ నేతలే ఊహించని షాక్ ఇచ్చారు. ఏపీలో ప్రస్తుతం రషీద్... హత్య ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
 

ఈ సంఘటన చుట్టే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అయితే దీనిపై అత్యవసరంగా జగన్మోహన్ రెడ్డి... పార్టీ ఎంపీలు అలాగే రాజ్యసభ సభ్యులతో మీటింగ్ నిర్వహించారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ఏపీలో జరుగుతున్న హింసకాండను ఢిల్లీ వేదికగా నిలదీయాలని.. ఈ సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు వైసిపి రాజ్యసభ సభ్యులు.
 

ఈ సమావేశానికి మొన్న గెలిచిన లోక్సభ ఎంపీలు నలుగురు హాజరయ్యారు. అటు...  రాజ్యసభ సభ్యులు ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఐదుగురు డుమ్మా కొట్టడం జరిగింది. అయితే రాజ్యసభ సభ్యుల్లో... వై వి సుబ్బారెడ్డి  కూడా ఈ సమావేశానికి రాకపోవడంతో ఆయన పార్టీ మారబోతున్నట్లు ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయి. జగన్కు అత్యంత సన్నిహితుడైన.. వై వి సుబ్బారెడ్డి పార్టీ మారబోరని వైసిపి చెబుతోంది. ఇక అటు మోపిదేవి, పరిమల్ సత్వాని  కూడా జగన్ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో అసలు ఈ నేతలు అందరూ... పార్టీలో ఉంటారా లేదా అని అందరిలోనూ టెన్షన్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: