ఇండియా జనాభా ఎంతో తెలుసా..చైనాను దాటేశామా?

Veldandi Saikiran
భారత దేశం చాలా గొప్పది. మన భారత దేశంలో అనేక రకాల మతాలు, కులాలకు చెందిన వారుంటారు. అలాగే.. ఇతర దేశాల నుంచి వచ్చి కూడా మన భారత దేశంలో స్థిరపడతారు. అనేక రంగాల్లో పని చేసే వారు మన ఇండియాలో ఉన్నారు. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. జనాభాలో మన ఇండియా కూడా టాప్‌ 10 లో ఉంటుంది. చైనా ఎక్కువ జనాభాతో ఉంటుంది. అయితే.. చైనా కంటే ఎక్కువ జనాభా ఇండియాలో ఉన్నారని ఐక్య రాజ్య సమితి తాజాగా ప్రకటించింది.

కానీ అది వాస్తవం కాదు. మరి ప్రస్తుతం భారతదేశ జనాభా ఎంతో తెలుసా....? అక్షరాల 144 కోట్లు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. అంటే చైనా కంటే మన జనాభా తక్కువే అన్న మాట. చైనా జనాభా 145 కోట్లకు పైగా ఉండే ఛాన్స్‌ ఉంది. ఇక ఇండియాలో 0 నుండి 14 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు 20 శాతం మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.


2021లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా సుమారు 121 కోట్లు. స్త్రీలు ప్రసవ సమయంలో శిశు మరణాల సంఖ్య బాగా తగ్గినట్టు నివేదికలో వెళ్లడైంది. దేశ జనాభాలో 10 నుండి 19 ఏళ్ల మధ్యనున్నవారు 17 శాతం మంది ఉండగా.... 10 నుండి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు 68 శాతం మంది ఉన్నారు. ఇక సీనియర్ సిటిజన్లు 70% మంది ఉన్నారు. సాధారణంగా పురుషుల ఆయుర్దాయం 71 సంవత్సరాలు కాగా.... స్త్రీల ఆయుర్దాయం 74 సంవత్సరాలుగా ఉందని (యుఎన్ఎఫ్పిఏ) తెలిపింది.

2006-2023 మధ్యకాలంలో భారతదేశంలో బాల్య వివాహాలు 28% శాతమని నివేదికలో వెల్లడించారు. పిఎల్ఓఎన్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో ప్రసవానంతర మరణాల నిష్పత్తి లక్ష జననాలకు 70 కంటే తక్కువగా నమోదు అయ్యింది. 114 జిల్లాల్లో మాత్రం ఈ నిష్పత్తి 210 కంటే ఎక్కువగా ఉంది. దాదాపు సగం మంది దళిత మహిళలకు ప్రసవానంతరం సంరక్షణ అందటం లేదని నివేదికలో వెల్లడించారు. ఇక ఏపీలో 6 కోట్ల వరకు జనాభా ఉందని ఈ లెక్కలలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: