తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత... గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు అందరూ జారిపోతున్నారు. పది సంవత్సరాలు ఆ పార్టీ తరఫున వచ్చిన పదవులను అనుభవించిన కీలక నేతలను కూడా జంప్ అవుతున్నారు. కెసిఆర్ ను ఒంటరి చేసి బయటకు వెళ్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో... కెసిఆర్ కు తెలంగాణ బిజెపి నేతలు సహాయం చేస్తున్నారు.
అదేంటి కెసిఆర్ కు బిజెపి సహాయం చేయడం ఏంటని అనుకుంటున్నారా? అవును ఇది నిజమే. గులాబీ పార్టీలో గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానం నాగేందర్ పై వేటు వేయాలని ఇప్పటికే గులాబీ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. కోర్టుకు కూడా... ఈ విషయాన్ని తీసుకువెళ్లింది. ఇంకా ఫలితం రాలేదు. ఇక ఇంతలోనే రంగంలోకి తెలంగాణ బిజెపి కూడా దిగింది.
గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన దానం నాగేందర్ పై... సస్పెన్షన్ వేటు వేయాలని... స్పీకర్ కు ఫిర్యాదు చేసింది తెలంగాణ బిజెపి. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా ఈ విషయంపై వెళ్తామని హెచ్చరించింది. ఇలా పార్టీలు మారే వారికి తగిన బుద్ధి చెప్పే వరకు తమ పోరాటం కొనసాగుతుందని... తెలంగాణ బిజెపి నేతలు చెబుతున్నారు. ఇలా కేసీఆర్ కోసం బిజెపి పార్టీ పనిచేస్తుందని కొంతమంది అంటున్నారు.
అయితే వాస్తవం మాత్రం అది కాదు... దానం నాగేందర్ పై వేటు పడితే... ఖైరతాబాద్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. బిజెపి ఈ కుట్రలు చేస్తుందని చెప్తున్నారు కొంత మంది. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో బిజెపి పార్టీకి భారీగా ఓట్లు పోలయ్యాయి. దీంతో దానం నాగేందర్ ఒక్కరిని మాత్రమే బిజెపి టార్గెట్ చేస్తోంది అని చెబుతున్నారు.