బీఆర్‌ఎస్‌ : టార్చ్‌ లైట్‌ పెట్టి చూసినా..కనిపించకుండా చేస్తున్న రేవంత్ ?

Veldandi Saikiran

తెలంగాణ రాష్ట్రంలో... గులాబీ పార్టీని  కతం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ పార్టీని... కెసిఆర్ ఎలాగైతే ఖాళీ చేశారో... ఇప్పుడు అచ్చం అలాగే... గులాబీ పార్టీని కూడా... పత్తా లేకుండా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరుసగా గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అలాగే ఎమ్మెల్సీలను కూడా జాయిన్ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు వ్యూహం మార్చారు.

వరుసగా... ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో..  చేర్పించుకున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో వరంగల్ అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు ఉన్నారు. బసవరాజు సారయ్య, అలాగే భాను ప్రసాద్ లాంటి కీలక రాజకీయ నాయకులు కూడా...  గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ పదవులు పొంది తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
 
అటు గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లo వెంకటరావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, కాల యాదయ్య  లాంటి వారు అందరూ జారుకున్నారు. ఇంకా మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా... గులాబీ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది.
 
అయితే ఈ చేరికలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. టార్చ్ లైట్ పెట్టిన కూడా... గులాబీ పార్టీని కనిపించకుండా చేస్తానని... సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  దానికి తగ్గట్టుగానే గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలందరినీ తన పార్టీలో చేర్పించుకుంటున్నారు. మరి ఈ సంక్షోభాన్ని గులాబీ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. గతంలో కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి గులాబీ పార్టీని కతం చేయాలని అనుకున్నారు. కానీ గులాబీ పార్టీ...ఉవ్వెఎత్తున  ఎగిసి పడింది. మరి ఇప్పుడు కూడా అదే ధోరణితో ముందుకు వెళుతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: