నారా వారి రెడ్ బుక్: ఇక పెద్దిరెడ్డి కుటుంబానికి ఇక దబిడి దిబిడే ?

Veldandi Saikiran

* నారా లోకేష్ రెడ్ బుక్ లో  పెద్దిరెడ్డి పేరు  
* టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత  ఒంటరైన పెద్దిరెడ్డి ఫ్యామిలీ
* అప్పుడు కుప్పంలో పెద్దిరెడ్డి హవా.. ఇప్పుడు పుంగనూరులో టిడిపి జోరు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ప్రస్తుతం రెడ్ బుక్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల కంటే ముందు... నుంచి రెడ్ బుక్కును మెయింటైన్ చేస్తున్నారు. వైసీపీ పాలనలో... గడిచిన ఐదు సంవత్సరాలలో.... తెలుగుదేశం పార్టీని ఎవరైతే... ఇబ్బంది పెట్టారు వారందరి పేర్లను  రాసేందుకు ఈ రెడ్ బుక్కు కాన్సెప్ట్ తెరపైకి తీసుకువచ్చారు నారా లోకేష్.
 

అయితే వైసిపి అండదండలతో... చాలామంది రాజకీయ నాయకులు అలాగే పోలీస్ అధికారులు... ఇటు ఉన్నతాధికారులు కూడా తెలుగుదేశం పార్టీని తొక్కేసే ప్రయత్నం చేశారన్నది మాత్రం వాస్తవం. అధికారంలోకి వచ్చాక వారందరినీ... ఒక ఆట ఆడుకుంటానని నారా లోకేష్ ముందే చెప్పారు.  నారా లోకేష్ అన్నట్లుగానే... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే... రెడ్ బుక్ తెరిచారు.

ముఖ్యంగా ఈ రెడ్బుక్ లో... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరు మొదటి వరుసలో ఉన్నట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి చాలా అరాచకాలు చేశారని... టిడిపి నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే పెద్దిరెడ్డికి షాక్ ఇస్తూ..  టిడిపి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుంది. పెద్దిరెడ్డి తో సన్నిహితంగా ఉన్న నేతలు అందరిని... టిడిపిలోకి లాగేసుకొని ఆయన  ను ఒంటరి చేస్తున్నారు.

పెద్దిరెడ్డి అలాగే మిథున్ రెడ్డిలను  పుంగనూరులో అడుగుపెట్టకుండా చేస్తున్నారు టిడిపి నేతలు. ముఖ్యంగా ఈ పెద్దిరెడ్డి కుటుంబం పైన అనేక రకాల కేసులు బుక్ చేస్తున్నారు. అయితే ఇదంతా రెడ్ బుక్కు ప్రభావమేనని కొంతమంది అంటున్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని... నారా లోకేష్ టార్గెట్ చేసి మరీ ఇలా... టార్చర్ పెడుతున్నారని ఈ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: