బాలికపై లైంగిక వేధింపులు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ ?

Veldandi Saikiran

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీకి వరుసగా శాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో.. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత... ఈ పరిస్థితుల్లో నెలకొన్నాయి. ఒక్కో నేత బయటికి వెళ్తుండటం... అలాగే వైసిపి నేతలపై టిడిపి ప్రభుత్వం కేసులు పెట్టడం జరుగుతుంది. ఇటు వైసిపి కార్యాలయాలను కూల్చేందుకు... రంగం సిద్ధం చేస్తున్నారు టిడిపి నేతలు.

అటు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు సర్కార్. ఇలా అడుగడుగునా జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో వైసిపి పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వైసిపి నేత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. సుధాకర్ తన ఇంట్లో పనిచేసే అమ్మాయితో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని ఇటీవలే అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయింది. గురువారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సుధాకర్ కి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు.

సుధాకర్ ఇంట్లో పని చేసే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలోనే అతనిపై ఆరోపణలు వచ్చాయి. లైంగిక వేధింపులకు సంబంధించి ఏపీ ఎన్నికలకు ముందు ఒక వీడియో కూడా వైరల్ గా మారడం జరిగింది. దీంతో సుధాకర్ తీరుపై మహిళా సంఘాలు అప్పట్లోనే దారుణంగా మండిపడ్డాయి. కానీ అప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో అతనిపై ఎలాంటి కేసులు నమోదుకాలేదు. ఇక ఇటీవల ప్రభుత్వం మారడంతో సుధాకర్ పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

తాజాగా సుధాకర్ ను అరెస్టు చేశారు. ఇక 2019 ఎన్నికల్లో సుధాకర్ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అతనిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సుధాకర్ స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్ కు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ కోడుమూరులో వైసీపీ విజయం సాధించలేక ఓటమిపాలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: