కేసీఆర్: గులాబీ పార్టీకి చంద్రబాబు భరోసా.. ఇదే జరిగితే మళ్ళీ అధికారం?
* తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ కు ఇంకా ఉన్న అభిమానం
* స్పష్టమైన ఓటు బ్యాంకు
* హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, లాంటి బలమైన లీడర్ల బలం
* తెలంగాణ తెచ్చిన పార్టీగా గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కల్వకుంట చంద్రశేఖర రావు ను... ఆ పార్టీ నేతలు నమ్మించి మోసం చేస్తున్నారు. గులాబీ పార్టీ టికెట్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలందరూ జారుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకున్న గులాబీ పార్టీ... అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం.. గులాబీ పార్టీని దెబ్బతీసాయి.
అందులో పని చేసిన నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. దీంతో చివరి వరకు ఉంటాను అనుకున్న నేతలు కూడా... పార్టీని వీడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు... గులాబీ పార్టీని వీడారు. అయితే... అధికారం కోల్పోయిన తర్వాత ఏ పార్టీ అయినా ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది. ఈ విషయంలో కెసిఆర్ పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. అధికారం ఉన్నన్ని రోజులు ఆ నేతలు అలాగే జంప్ అవుతూ ఉంటారు.
కష్టకాలంలో... అండగా ఉన్న నేతలను కేసీఆర్ ఇకనైనా నమ్ముకోవాలి. వలస నాయకులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా టిడిపి నుంచి వచ్చిన నేతలను కెసిఆర్ అస్సలు నమ్మకూడదు. పోయిన ఎమ్మెల్యేలను... వదిలేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న హామీలపై ప్రశ్నించాలి. అంతేకాకుండా... తన గురువు చంద్రబాబు నాయుడు.. ఫార్ములాను కూడా కేసీఆర్ ఫాలో కావాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టిడిపి పార్టీని వైసీపీ చిత్తు చిత్తు చేసింది. 23 స్థానాలకే పరిమితం చేసింది వైసిపి.
ఆ తర్వాత టిడిపిలో ఉన్న కీలక నేతలందరూ వైసీపీలోకి వెళ్లారు. టిడిపి పార్టీని...నాశనం చేసే ప్రయత్నం అక్కడ జరిగింది. అంతేకాకుండా చంద్రబాబును జైలుకు కూడా పంపించారు. ఇంత జరిగినా కూడా... ఆ పార్టీని కార్యకర్తలు కాపాడుకున్నారు. చంద్రబాబు కూడా అస్సలు వణుకలేదు. ఫలితంగా మొన్న 174 స్థానాలు సంపాదించుకొని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. ఇప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు రూట్ లోనే వెళ్లాలి. గులాబీ పార్టీకి స్పష్టమైన... ఓటు బ్యాంకు ఉంది. దాన్ని కాపాడుకుంటూ మరింత పెంచుకునే ప్రయత్నం చేయాలి. కెసిఆర్ అంటే ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల్లో అభిమానం ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో కాస్త వ్యతిరేకత మొదలైంది. వాటన్నిటిని క్యాష్ చేసుకొని... నిత్యం ప్రజల్లో ఉంటూ... మళ్లీ అధికారంలోకి వచ్చేలా స్కెచ్ లు వేయాలి.