వైసీపీ కష్టాలు : ఆంధ్రుల తీర్పుతో ఆపసోపాలు పడుతున్న జగన్?

FARMANULLA SHAIK
•ఆంధ్రుల తీర్పుతో జగన్ విశ్వాసం కోల్పోయాడా?
•జగన్ చిన్నా చితక పథకాలు జనాలకు నచ్చలేదా?
•వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయిన జగన్!
•కనీసం మరో అవకాశం కోసమైన జగన్ ప్రయత్నిస్తాడా?
 
( అమరావతి - ఇండియా హెరాల్డ్) : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత 2019 ఎన్నికల్లో వైసీపీతో సాధించిన విజయం మామూలు విజయం కాదు. అదొక అఖండ విజయం. ప్రముఖ రాజకీయ నేతలను సైతం  ఆశ్చర్యానికి గురి చేసిన విజయం అది. ఏకంగా 151 స్థానాల్లో వైసీపీ గెలిచి ఆ సమయంలో టీడీపీకి పూర్వ వైభవం కష్టమేనన్న పరిస్థితి తెచ్చింది. ఆ రేంజ్ లో ఆంధ్రులు జగన్ ని గుండెల్లో పెట్టుకొని అతనికి అరుదైన అవకాశం ఇచ్చారు. కానీ ఏం లాభం గత 5 ఏళ్ల నుంచి తన బూతు రాజకీయంతో సర్వ నాశనం చేసుకున్నాడు. ఎంత గొప్ప విజయం సాధించాడో అంత కన్నా దారుణంగా ఇప్పుడు ఓడిపోయాడు. జనాల తీర్పుతో ఇప్పుడు ఏం చెయ్యాలో అర్ధం కాక ఆపసోపాలు పడుతున్నాడు.తాను పెట్టిన చిన్నా చితక పథకాలతో జనాలని వలలో వేసుకోవాలని చూసాడు. కానీ జగన్ పప్పులేవి ఉడకలేదు.అప్పుడు జనం మెచ్చిన జగనన్న ఇప్పుడు ఒంటరి జగనోరు అయ్యారు. రాష్ట్రంలో 164 స్థానాల్లో కూటమి అద్భుతమైన విజయం సాధించగా వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

జనాలని తక్కువ అంచనా వేసి బూతు రాజకీయాలు చేసి అతి విశ్వాసం చూపించి జనాల చేతిలో దారుణంగా ఓడాడు. 151 సీట్లు గెలిచాక ఇక తానే ఆంధ్రాకి నియంత అనుకున్నాడేమో.. కానీ ప్రజాస్వామ్యం ముందు పతనం అయిపోయాడు. అసలు జగన్ పతనానికి కారణం.. అతని బూతు రాజకీయాలు, బూతు నేతలు ఇంకా జనాలకు అవసరం లేని చిన్న చితక పథకాలు. ఇవే జనాలకు ఒళ్ళు మండేలా చేసాయి. ఒక ముష్టి వాడికి రోజు కడుపునిండా అన్నం పెట్టడం వేరు.. వాడికి నెలకి ఓసారి అన్నం పెట్టడం వేరు.. ముష్టి వాడికి అర్ధ రూపాయి దానం చెయ్యడం వేరు.. వాడిని ఆ అర్ద రూపాయి సంపాదించుకునేలా చెయ్యడం వేరు.. కానీ ముష్టి వాడికి అర్థ రూపాయి దానం చేసి.. ఎప్పుడో ఒకసారి అంత అన్నం పడేసి ఆకలి తీరింది అనుకుంటే ఏం లాభం?.. జగన్ పాలన కూడా అలాంటిదే.. తాను పెట్టిన పథకాలు అలాంటివే. జనాలని తక్కువ అంచనా వెయ్యడం జగన్ తప్పు.. ఆ తప్పే జగన్ కొంపముంచింది. ఓడిపోయేలా చేసింది. సరే ఓడిపోతే ఓడిపోయాడు. గెలుపు ఓటములు సహజం. ఇకనైనా జనాల ముందుకు వద్దాం జనాల సమస్యల పై పోరాటం చేద్దాం అన్న ప్రయత్నం కూడా ఏమి చెయ్యట్లేదు జగన్.. మరి చూడాలి మున్ముందు అయిన ఆ ప్రయత్నం చేసి ఆంధ్రుల నుంచి జగన్ మరో అవకాశం పొందుతారో లేరో అనేది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: