వైసీపీ కష్టాలు: ఓడిపోవడమే జగన్‌కు పెద్ద శాపమైందా.. ఒక్కో బాగోతం బయటపడుతోందిగా..??

Suma Kallamadi
* కేవలం 11 సీట్లతో పతనమైన వైసీపీ  
* ఈ ఓటమితో మొదలైన జగన్ కష్టాలు  
* ఐదేళ్లపాటు నరకం అనుభవించాల్సిందే  
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
వైసీపీ పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో సుపరిపాలన అందించిన తర్వాత కూడా పార్టీ ఎందుకు ఘోరంగా ఓడిపోయిందో ఇప్పటికీ  అర్థం చేసుకోలేకపోతున్నారు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి. ఎన్నికల లెక్కింపు రోజునే ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఏడుపు ఒక్కటే తరువాయి అన్నట్లు ఆయన ప్రెస్ మీట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. జీవితాంతం ప్రతిపక్షంలో ఉన్నానని, మళ్లీ కష్టాలు రాబోతున్నాయని, వాటిని ఫేస్ చేయడానికి కూడా సిద్ధం అని అంటూ చాలా బాధగా మాట్లాడారు.
జగన్ కు తెలుసు ఆ రోజు నుంచే తన కష్టాలు మొదలయ్యాయని! వైసీపీ 11 సీట్లతో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత దానికి కారణాలు చాలా ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. జగన్ ప్రభుత్వ సొమ్ముతో చాలా భవనాలను కట్టించారు. అలా డబ్బును దుర్వినియోగం చేశారనే నిజం ఆయన ఓటమి తర్వాతే బయటపడింది.
వైఎస్ భారతీ కూడా చాలామందికి ప్రభుత్వాలు ఉద్యోగాలు అక్రమంగా ఇప్పించారని తెలిసింది. వాలంటీర్లు, ఉద్యోగులు సాక్షి పేపర్‌ను కొనుగోలు చేసే లాగా జగన్ బలవంత పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. తన సొంత పేపర్ కు పాఠకుల సంఖ్య పెరగడానికి, ఆదాయం రావడానికి ఆయన ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి 200 రూపాయల అలవెన్స్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈ లెక్కన ఐదేళ్లలో ఆయన రూ.300 కోట్లు అక్రమంగా తినేసారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.
దీనికి తోడు ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నేతలు జగన్ తమతో ఎప్పుడూ కాంటాక్ట్ అవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ ఓటమి తర్వాత వాళ్లు వేరే పార్టీ లోకి జంప్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వారిని కాపాడుకోవడమే జగన్ కు పెద్ద సవాలయ్యింది. అలాగే అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు వెళ్లే కష్టాలు కూడా మొదలైనట్లు ఉన్నాయి. హైదరాబాదులో ఉన్న జగన్ లోటస్ పాండ్‌ను కూడా కొద్దిగా కూల్చివేశారు. ఇంకా జగన్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ప్రభుత్వ ఆఫీసులను, భవనాలను కూడా చంద్రబాబు బుల్డోజర్ తో కూల్చి వేస్తున్నారు. కొడాలి నాని, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాయుడు అంటే వారు కూడా అవినీతి కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇంకా వివిధ పరిశ్రమల్లో జరిగిన అవినీతిని బయట పెట్టి జగన్ పై చర్యలు తీసుకోవడానికి టీడీపీ సిద్ధమయ్యింది. ఈ అన్ని కారణాలవల్ల జగన్ 5 ఏళ్లలో చాలా కష్టాలను అనుభవించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: