ఏపీ: ప్రజలకు మరో షాకిచ్చిన చంద్రబాబు..?

Divya
ఆంధ్రప్రదేశ్లో టిడిపి పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వం వైసీపీ తీసుకు వచ్చిన కొన్ని నిర్ణయాలను కూడా స్వస్తి పలుకుతోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలోని జీవోలను సైతం పరిశీలించి వాటిని రద్దు కూడా చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్ ఉద్యోగుల సేవలను కూడా కొనసాగిస్తూ గత ప్రభుత్వం సవరించినప్పటికీ ఆ ఉత్తర్వులను కూడా చంద్రబాబు ఇటీవలే రద్దు చేశారు. ఇలాంటివారిని తొలగించి దీనిపైన ఒక నివేదిక సైతం అందజేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు.

అలాగే వైసిపి బీమాలో ఉన్న పథకాన్ని చంద్రన్న బీమా గా మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పైగా బీమా పథకాన్ని మూడు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు టిడిపి ప్రభుత్వం. తాజాగా టిడిపి మరొక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో అమలు చేసిన ఇంటింటికి రేషన్ పథకాన్ని కూడా టిడిపి ప్రభుత్వం స్వస్తి పలికినట్లుగా తెలుస్తోంది. దీనిపైన గిరిజన సంక్షేమ మహిళా  సంక్షేమ శాఖ అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అధికారులతో సమావేశమైన మంత్రి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఇంటింటికి రేషన్ పథకానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. ఇకపై రేషన్ షాపుల ద్వారా మాత్రమే రేషన్ ఇంటింటికి పంపిణీ చేయబోతున్నారని గిరిజన ప్రాంతాలలో బియ్యం వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిలిపివేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంటింటికి అందిస్తున్న రేషన్ విధానాన్ని రద్దు చేసి కేవలం 960 గిరిజన ప్రాంతాలలో ఉండే రేషన్ షాపులను పునరుద్దించాలంటే మంత్రి ఆదేశాలని తెలిపింది. అలాగే గిరిజన ప్రాంతాలలో వసతి గృహాలతో పాటు ఏఎన్ఎంలు అంబులెన్స్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను త్వరలోనే తీసుకురాబోతున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలియజేసింది. ఇక మీదట ఏపీ ప్రజలు డీలర్ల వద్ద రేషన్ ని వేయించుకోవలసి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: