పవన్ అలా చేస్తే.. అసెంబ్లీలో చంద్రబాబుకు ఇబ్బంది తప్పదా?

praveen
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఇక మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏకంగా ఇటీవలే ప్రొటెం స్పీకర్ సమక్షంలో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే దారుణ ఓటమి తర్వాత జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్. ఆయన కూడా అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ నేటి నుంచి పులివెందుల పర్యటనకు వెళ్లడంతో ఇక అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టబోతున్నారు.

 అయితే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో  ప్రజా సమస్యలపై ఎవరి తీరు ఎలా ఉండబోతుంది? ఎవరు ఎలా గళం విప్పబోతున్నారు అన్న విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం చంద్రబాబుకి అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన దానికి కావలసిన దానికంటే ఎక్కువ సీట్లు టిడిపి గెలిచింది. అయినప్పటికీ జనసేన బీజేపీ పార్టీలతో ఉన్న పొత్తుకు న్యాయం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. కాగా ఇంత మెజారిటీ ఉన్నప్పటికీ అటు చంద్రబాబుకి అసెంబ్లీలో ఒక్క విషయం మాత్రం అటు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అదే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి.

 సినిమా హీరోగా ఉన్నప్పుడు లగ్జరీ లైఫ్ ను వదులుకొని ప్రజలకు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఇక ఎన్నిసార్లు ప్రజలు దెబ్బ కొట్టిన వాళ్ల తరపున పోరాడారు. ఏ పదవి లేకపోయినా ప్రజలకు సహాయం చేస్తూనే వచ్చారు. ఇలా ప్రజలకు సమస్య వచ్చిందంటే ఏం చేయడానికి అయినా సిద్ధమవుతూ ఉంటారు పవన్. ఇక ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఏకంగా ప్రజాసమస్యలపై పోరాటం చేసే అవకాశం వచ్చింది.


 ఇలా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి అనే పవన్ దూకుడు అయిన శైలే అటు చంద్రబాబుకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాజకీయాలు అన్న తర్వాత మొండిగా ముందుకు సాగితే నడవదు. ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అన్న విషయం తెలిసి ఉండాలి  40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ విషయం బాగా తెలుసు. కానీ పవన్ అలా కాదు ప్రజా ఇబ్బందులు పడుతున్నారంటే చాలా ఆ సమస్యపై మొండిగా ముందుకు సాగుతారు. ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అన్న విషయాన్ని అస్సలు పట్టించుకోరు. ఇదే దూకుడు తనంతో కొన్ని కొన్ని సార్లు బాబు ప్రభుత్వ వైఫల్యాలపై కూడా పవన్ విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు.  దీంతో ఇలాంటి పవన్ లోని ఇలాంటి దూకుడు తనమే అటు చంద్రబాబుకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: