చట్టసభల్లో.. స్పీకర్ ఎందుకంత కీలకం.. ఆయన అధికారాలేంటి?

praveen
ఇటీవలే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదిరింది. ఏకంగామొన్నటికి మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన టిడిపి కూటమి పార్టీలు.. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  కాగా నేడు ఇకఅసెంబ్లీ సమావేశం జరుగునుంది. ఈక్రమంలోనే మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారందరూ కూడా ఇక ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎవరిని ఎన్నుకోబోతారు అనే విషయంపై గత కొన్ని రోజుల నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది అన్న విషయం తెలిసిందే.

 కాగా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకోబోతున్నట్లు ఇప్పటికే ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇక ఈరోజు ఈ విషయం అధికారికంగా అందరికీ తెలియబోతుంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక జనసేన పార్టీలోని కీలక నేతకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉంది. అయితే చట్టసభల్లో స్పీకర్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఈ స్పీకర్కు ఉండే అధికారాలు ఏంటి.. చట్టసభల్లో స్పీకర్ కు ఎందుకు అంత ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు అందరు ఆసక్తిని చూపిస్తున్నారు.

 ఇంతకీ స్పీకర్ బాధ్యతలు ఏంటంటే.. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనకుండా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటం స్పీకర్ బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పీకర్ మాట తూచా తప్పకుండా వినాల్సిందే. అయితే ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే.. ఇక ఆ సభ్యులను అనర్హులుగా స్పీకర్ ప్రకటించేందుకు అధికారం ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు కూడా తీసుకోవచ్చు. అవసరమైతే ఇక సభ నుంచి సస్పెండ్ కూడా చేసి అధికారం స్పీకర్ కి ఉంటుంది. ఇక సభలో ఏదైనా తీర్మానం జరిగినప్పుడు ఇరువైపులా సమాన ఓట్లు పడితే.. ఇక అప్పుడు ఆ తీర్మానం ఆమోదం పొందడానికి స్పీకర్ ఓటు కీలకంగా మారుతుంది. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాల అజెండాను నిర్ణయించేది కూడా స్పీకరే కావడం గమనార్హం. అందుకే ఇక అసెంబ్లీలో స్పీకర్ కి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. కేవలం అసెంబ్లీలో మాత్రమే కాదు లోక్ సభలో కూడా స్పీకర్ కి ఇలాంటి అధికారాలే ఉంటాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: