హోం మంత్రి కావలెను.. బిఆర్ఎస్ పోస్ట్ వైరల్?

praveen
గత కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో దారుణమైన హత్యలు అఘాయిత్యాలు  జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే  ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వరుస హత్యలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.  ఇలా రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను అరికట్టాల్సిన అవసరం ఉంది అంటూ ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోంది అంటూ ఎంతో మంది ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు.

 కాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు అటు హోం మంత్రిని నియమించకపోవడం గమనార్హం. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ చేపట్టినప్పటికీ.. ఎవరికీ ఏ శాఖను కేటాయించారు అనే విషయంపై ఇప్పటివరకు ఒక క్లారిటీ లేకుండా పోయింది. అయితే పోలీస్ శాఖను కంట్రోల్లో పెట్టుకునే హోం మంత్రి లేకపోవడం కారణంగానే రాష్ట్రం అవాంచిత కార్యకలాపాలకు వేదికగా మారిపోయిందని ఎన్నో దారుణమైన హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటూ ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే కారు పార్టీ ఇటీవల సోషల్ మీడియాలో  పెట్టిన పోస్ట్ ఒకటి సంచలనంగా మారింది.

 హోంమంత్రి కావలెను అంటూ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక సెటైరికల్  పోస్ట్ పెట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు హోం మంత్రి అవసరం ఇప్పుడు ఎంతో ఉంది అంటూ తెలిపింది. తొమ్మిదిన్నరేళ్లు  రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రజల భద్రతను పట్టించుకునే దిక్కేలేదు. హత్యలు అత్యాచారాలు ఘర్షణలు అఘాయిత్యాలు ఎక్కడ చూసినా కూడా పెరిగిపోయాయి. వీటన్నింటినీ అణిచివేసేందుకు వెంటనే రాష్ట్రానికి ఒక హోం మంత్రి కావాలి అంటూ బిఆర్ఎస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg

సంబంధిత వార్తలు: