అభివృద్ధి + సంక్షేమం + 20 లక్షల ఉద్యోగాలు.. బాబు సామర్థ్యానికి ఇవే ప్రూఫ్ గా నిలవనున్నాయా?

Reddy P Rajasekhar
టీడీపీ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చంద్రబాబు పాలనలో ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, 20 లక్షల ఉద్యోగాలకు ప్రాధాన్యత దక్కాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. బాబు సామర్థ్యానికి ఇవే ప్రూఫ్ గా నిలవనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తన మార్క్ పాలనతో బాబు సత్తా చాటాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.
 
చంద్రబాబు చుట్టూ చాలా సవాళ్లున్నాయి. ఈ సవాళ్లలో మెజారిటీ సవాళ్లను ఆర్థికంగా బలపడటం ద్వారా అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయి. జగన్ పాలనలో భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినా ప్రభుత్వ ఉద్యోగుల మనస్సు గెలుచుకోవడంలో జగన్ ఫెయిలయ్యారు. అయితే చంద్రబాబు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా వాళ్లకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించాల్సి ఉంది.
 
మరోవైపు పలు పథకాలకు సంబంధించి జగన్ ముద్ర తొలగిపోయేలా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. కూటమి నేతలు మధ్యాహ్న భోజన పథకానికి గోరుముద్ద అనే పేరు పెట్టారు. విద్యార్థుల మెనూలో కూడా కూటమి మార్పులు చేస్తుందేమో చూడాల్సి ఉంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో బాబు కుటుంబ సభ్యులతో పాటు అమరావతి రైతులు ఎమోషనల్ అయ్యారు.
 
చంద్రబాబు 4.0 సర్కార్ పండుగలా కొలువుదీరిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చూడటానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు వచ్చారు. వచ్చే ఐదేళ్లు అదిరిపోయే సంక్షేమ పథకాల అమలుతో పాటు అసలైన అభివృద్ధి అంటే ఏంటో ఏపీ ప్రజలు చూస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలు ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఏ స్థాయిలో నెరవేరుస్తారో చూడాలి. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో సిక్సర్ కొట్టారనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపు ఉన్న నేత అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సపోర్ట్ ఉండటం టీడీపీ జనసేనలకు ఎంతో ప్లస్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: