అప్పుడు నో అపాయింట్‌మెంట్.. ఇప్పుడు ఈగలు తోలుకుంటున్న జగన్..??

Suma Kallamadi
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఈ ఎలక్షన్స్‌లో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ ఘోర పరాజయం పాలయ్యారు. దీని తర్వాత జగన్ ఓడిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని చాలామంది కథనాలు రాశారు. అందులో ఒక కారణం అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎమ్మెల్యేలను కలవకపోవడమే అని కొందరు చెప్పారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా జగన్ను కలవడం కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడు మాత్రం ఖాళీ సమయం గడుపుతున్నారట. ఓడిపోయాడు కాబట్టి చేసే పని ఏమీ లేక ఫ్రీగా ఈగలు తోలుకుంటూ జగన్ ఉన్నారని టీడీపీ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఖాళీ సమయం దొరకడంతో తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నారట. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత, జగన్ మోహన్ రెడ్డి తనను తాను ఒంటరిగా చేసుకున్నారు, కేవలం సన్నిహితులను మాత్రమే తన ఇన్నర్ సర్కిల్‌లోకి అనుమతించారు.
2019కి ముందు జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి మరణానంతరం తన ఓదార్పు యాత్రలో ప్రజలను ముద్దుపెట్టుకుని ఓదార్చుతూ ప్రజలతో మమేకమయ్యారు. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అతను ప్రతికూల లక్షణాలను చూపించడం ప్రారంభించారు. కక్ష సాధింపు చర్యలతో  నియంతలా వ్యవహరించారు. అలానే ఆయనను కలిసేందుకు ఆయన అనుమతి కోసం సొంత పార్టీ నేతలు, మంత్రులు కూడా పాకులాడేవారు. ఎన్నిసార్లు వెళ్లిన కలవకపోవడం వల్ల వైసీపీ సభ్యులు, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది. చాలా మంది పార్టీ నాయకులు ఈ పద్ధతిపై బహిరంగంగా ఫిర్యాదు చేశారు.
అయితే ఇప్పుడు వైసీపీ నేతలెవరూ అపాయింట్‌మెంట్ అవసరం లేకుండా నేరుగా ఆయన వద్దకే వస్తున్నారట, జగన్ అందరి మాటలు ఓపికగా వింటున్నారట. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాతే జగన్ తన నిజ స్వరూపాన్ని గ్రహించారని, మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అహంకారంతో ఉన్నవారికి జీవితం ఇలాంటి గుణపాఠాలే నేర్పిస్తుందని కొంతమంది జగన్ పరిస్థితిని హైలెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ కూటమి విజయంపై అనుమానాలు ఉన్నాయని వైసీపీ నేతలు సంచలన కామెంట్లు చేస్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో ఆరోపణ చేసే వారికి, టీడీపీ నేతలకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: