ముఖ్యమంత్రి అయ్యాక.. ఈ మూడు ఫైళ్లపై సంతకాలు చేయాల్సిందే?

Veldandi Saikiran

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. వైసిపి పార్టీని నేలమట్టం చేసిన తెలుగుదేశం కూటమి... 164 స్థానాలు సంపాదించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఆగస్టు 12వ తేదీన... చంద్రబాబు నాయుడు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇదే రోజున మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే..  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా... తెలుగుదేశం కూటమి పార్టీలు చాలా హామీలు ఇచ్చాయి.
 అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు  ఫైల్స్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో మొట్టమొదటిది... నిరుపేదలకు పెన్షన్ల పెంపు. ఏ ప్రభుత్వానికైనా.. పెన్షన్ల పంపకం చాలా కీలకం. ఈ పెన్షన్ల పంపకంలో తేడాలు వస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి. అయితే ఎన్నికల హామీలో భాగంగా... ముఖ్యమంత్రి అయిన తర్వాత 4000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు తెలిపారు.
 అంతేకాదు ఈ పెన్షన్ ను.. ఏప్రిల్ మాసం నుంచి అమలు చేస్తామని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఏపీ ప్రజలు బాగా నమ్మారు. ఈ లెక్కన ఏప్రిల్, మే అలాగే జూన్ నెలల 3 బకాయిలు... జులై నెలకు సంబంధించిన నాలుగు వేల రూపాయల పెన్షన్... మొత్తం కలిపి 7000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫైల్ పై చంద్రబాబు మొదటి సంతకం పెట్టానున్నారు. ఇక భూ హక్కు చట్టం  రద్దు పై రెండవ సంతకం చంద్రబాబు పెట్టనున్నారు.
 ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  వైసీపీని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల హామీలలో చంద్రబాబు టీం పేర్కొంది. దింతో ఇప్పుడు చంద్రబాబు.. ఈ చట్టాన్ని రద్దు చేయడంపై పెట్టాల్సి ఉంటుంది. ఇక చివరిది మెగా డీఎస్సీ. జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ అభ్యర్థులకు సమయం ఎక్కడ కేటాయించలేదు. దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే ఇప్పుడు... మెగా డీఎస్సీ  రిలీజ్ చేయడం పై చంద్రబాబు సంతకం చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: