తెలంగాణ బిజెపిలో కేంద్ర మంత్రి పదవి ఎవరికేనా?

Veldandi Saikiran
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీ తెలంగాణలో దుమ్ము లేపింది. 2019 ఎన్నికల్లో... కేవలం నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న... భారతీయ జనతా పార్టీ... ఈసారి మాత్రం డబుల్ స్థానాలను కైవసం చేసుకుంది. 14 సీట్లు గెలవాలనే లక్ష్యంతో... ఎన్నికల బరిలోకి దిగిన బిజెపి పార్టీ... 8 స్థానాలు గెలుచుకుంది. గతంలో గెలిచిన సిట్టింగ్ స్థానాలను మళ్లీ కైవసం చేసుకోవడమే కాకుండా... కొత్తగా మరో నాలుగు స్థానాలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది బిజెపి.
 అయితే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అఖండ విజయం నమోదు చేసుకున్న నేపథ్యంలో... మంత్రి పదవులు ఎవరికి వస్తాయని..  కొత్త చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో... కనీసం ఇద్దరికీ కేంద్రమంత్రి పదవులు వస్తాయని సమాచారం అందుతోంది. అయితే ఇందులో కిషన్ రెడ్డి మొదటి వరుసలో ఉంటారట. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. సీనియర్ బిజెపి నాయకులు. కాబట్టి ఆయనకు కేంద్ర మంత్రి పక్కా అని... ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.
ఇటు రేవంత్ రెడ్డి... గతంలో ఎంపిక గెలిచిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో... బిజెపి జెండాను ఎగరవేశారు ఈటల రాజేందర్. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు ఈటల రాజేందర్. ఇలాంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ కు కూడా కేంద్ర మంత్రి పదవి వస్తుందని అంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీకి ఓటు తీసుకు వచ్చిన బండి సంజయ్ కి కూడా మంత్రి పదవి వస్తుందని.. చర్చ జరుగుతోంది.
 బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి పదవి కోసం అరవింద్ కూడా పోటీ పడుతున్నారు. యువకుడు అలాగే ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా పనిచేశాడు. అందుకే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మంత్రి పదవి వస్తుందని చెబుతున్నారు. అటు డీకే అరుణ కూడా మహిళ కోటాలో... కేంద్రమంత్రి పదవి కొట్టేయడం ఖాయమని అంటున్నారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బిజెపి జెండాను ఎగరవేశారు డీకే అరుణ. అందుకే ఆమెకు ముందు వరుసలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెబుతున్నారు. ఇక చివరగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం.. ఎదురుచూస్తున్నారు. ఇందులో కనీసం ఇద్దరికీ ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: