ఏపీలో ముగ్గురు హీరోలు: పప్పు కాదు లోకష్ నిప్పు..ఐటీని దున్నేయ్యాలి?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఐదు సంవత్సరాల వైసిపి పాలనను భూస్థాపితం చేసిన... తెలుగుదేశం కూటమి.. ఈనెల 12వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అదే రోజున కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా... డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందుతోంది.
 అయితే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో... టిడిపి అగ్ర నేత నారా లోకేష్  పాత్ర గురించి అందరిలోనూ చర్చ మొదలైంది. మొన్నటి వరకు అందరూ నారా లోకేష్ ను పప్పు అంటూ పరువు తీశారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని...  మంత్రి పదవి ఏం చేస్తావని వైసిపి బాగా ట్రోలింగ్ చేసింది. అయితే వైసిపి కి కౌంటర్ గా...  మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 91 వేల  భారీ మెజారిటీతో నారా లోకేష్ విజయం సాధించారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేష్.. తాను పప్పు కాదు నిప్పు అంటూ నిరూపించారు.
అయితే నారా లోకేష్.. తన తదుపరి చర్యగా... పంచాయతీ శాఖ అలాగే ఐటీ శాఖ చేపట్టే ఛాన్స్ ఉంది. గతంలో ఈ రెండు శాఖలను నారా లోకేష్ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇక ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు...  హైదరాబాద్ ను తలదన్నేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...  ఐటీ శాఖను డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. తన ఎక్స్పీరియన్స్ తో... పెద్దపెద్ద ఐటీ కంపెనీలను అమరావతికి తీసుకురావాలి. లేదా వైజాగ్ లో... ఐటీ డెవలప్మెంట్ చేయాలి.
 ప్రపంచ దేశాలలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహం చేయాలి నారా లోకేష్. ఐటీ శాఖ అంటే నారా లోకేష్ అని అనేలా.. మంచి పనితీరు కనబరచాలి. అలాగే..  పంచాయతీ శాఖ కూడా పటిష్టంగా చేయాల్సిన బాధ్యత నారా లోకేష్ పైన ఉంటుంది.  ఆంధ్రప్రదేశ్ మొత్తం అందంగా కనిపించాలంటే ప్రతి గ్రామపంచాయతీ నీట్ గా ఉండాలి. ఆ పూర్తి బాధ్యతలో నారా లోకేష్ తీసుకోవాల్సి ఉంటుంది. పంచాయతీ శాఖలో భారీగా నిధులు పెట్టి... గ్రామాలను సస్యశ్యామలం చేయాలి.
అదే సమయంలో... ఏపీలో యూత్ కు మంచి ఉపాధి కల్పన కల్పించాలి. అటు తెలుగుదేశం పార్టీని కూడా... కాపాడుకోవాలి. చంద్రబాబు నాయుడు తర్వాత.. పార్టీ బాధ్యతలు నారా లోకేష్   తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి... ఇప్పటినుంచి క్యాడర్ను చాలా బాగా కాపాడుకోవాలి. పార్టీ కోసం కష్టపడ్డ వారిని... ఆదుకోవాలి. చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తే... తెలుగుదేశం బాధ్యత తీసుకోవాలి. ఈ సవాల్ అన్ని నారా లోకేష్ కచ్చితంగా దీటుగా ఎదుర్కోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: