పెనుగొండ: సవితమ్మదే విజయం..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి మరింత ఆసక్తికరంగా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నామినేషన్ పర్వం మొదలైనప్పటి నుండి నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకు అందరిలోనూ ఉత్కంఠ మరింత ఎక్కువైందనే చెప్పవచ్చు. అటు వైసిపి గెలుస్తుందా ఇటు టిడిపి గెలుస్తుందా అన్న అనుమానాలు ప్రజలలో మరింత ఎక్కువగా ఉండేవి .. అయితే ఎగ్జిట్ పోల్స్ ని పూర్తిగా నమ్మలేని పరిస్థితి. ప్రజల అంచనాలు ఏ విధంగా ఉన్నాయో తెలియాలి అంటే జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే.. ఈ నేపథ్యంలోనే.. పెనుగొండ అభ్యర్థులలోనే కాదు అక్కడి ఓటర్లలో కూడా తీవ్ర ఉత్కంఠత నెలకొంది..
2024 ఎన్నికల్లో భాగంగా టిడిపి తరఫున కురవ సామాజిక వర్గానికి చెందిన ఎస్ సవిత బరిలోకి దిగగా.. వైసీపీ తరఫున మంత్రి వి ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఉషశ్రీ బీసీ, కురబ సామాజిక వర్గానికి చెందిన ఈమె.. ఒకప్పుడు టిడిపి మహిళా విభాగంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసింది. 2014లో టిడిపిని వీడి వైసీపీలో చేరి 2019లో వైసీపీ నుంచి కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిచింది. మరోవైపు టిడిపి తరఫున ఎస్ .సవిత విషయానికి వస్తే.. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఈమె మాజీ మంత్రి మాజీ ఎంపీ ఎస్ రామచంద్రారెడ్డి కుమార్తె.. ఈమె గతంలో కురవ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ గా పనిచేసింది .ఇక ఎస్ ఆర్ ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఇప్పటికీ కొనసాగిస్తోంది.

ఇక్కడ బిసి ఓట్లు ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పరిగి ,పెనుగొండ ,గోరంట్ల ,రొద్దం,  సోమందేపల్లి మండలాలు పెనుగొండ నియోజకవర్గంలోకి వస్తాయి.. ఇక పెనుగొండ నియోజకవర్గంలో సవిత,  ఉషశ్రీ చరణ్ నువ్వా నేనా అంటూ పోటీపడి మరి ప్రచారాలు నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ కంటే పెనుగొండ నియోజకవర్గానికి చెందిన సవితాకే స్థానికంగా బలాబలాలు ఎక్కువ ఉన్నాయి. పైగా సవిత గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ వార్తలు రాగా తాజాగా వెలువడిన ఫైనల్ కౌంటింగ్లో.. ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ మీద.. సవితమ్మ 113832 ఓట్ల తేడాతో గెలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: