కూటమిని వణికిస్తున్న ఎగ్జిట్ పోల్స్.. ఓటమి తప్పేలా లేదు?

Purushottham Vinay
టీడీపీ కూటమిలో ఎగ్జిట్ పోల్స్ టెన్షన్ స్టార్ట్ అయింది.ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయోనని కూటమి నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉంటే దాదాపుగా అవే ఫలితాలు వస్తాయని చాలా పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల తరువాత విశ్రాంతి తీసుకున్న పలువురు నేతలు ప్రస్తుతం తమ తమ నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. ఎల్లుండి అమరావతికి జనసేనాని పవన్ కల్యాణ్ రానున్నారు.త్వరలో చంద్రబాబు, పవన్  భేటీ కానున్నారు. పోలింగ్ జరిగిన తీరు, తరువాత జరిగిన పరిణామాలపై వీరు సమీక్షించనున్నారు. చంద్రబాబును బీజేపీ నేతలు కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది. ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతుంది. దీంతో గెలిచేది ఎవరు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే ఉత్కంఠ అందరిలో పెరిగిపోతోంది.ఇక ఎల్లుండి సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఎగ్జిట్ ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎల్లుండి సాయంత్రం దాదాపుగా 6 గంటల తర్వాత వస్తాయని సమాచారం తెలుస్తుంది.


ఆ ఫలితాల కోసం  చంద్రబాబు కూడా ఎదురుచూస్తున్నారు. కూటమి నేతలంతా ఎన్నికల్లో బాగానే పోరాటం చేశారు. చాలా సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ పాల్గొని ప్రచారం నిర్వహించారు. వీరంతా కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి దాకా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ ముందంజలో ఉందని తెలుస్తుంది. అందువల్ల టీడీపీ వణుకుతుంది. టీడీపీ మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. గత ఎన్నికల్లో ఒక్క స్థానమే సాధించిన జనసేన ఈసారి ఎన్ని స్థానాలు గెలుస్తుందో అని ఆ పార్టీ నేతలు టెన్షన్ లో ఉన్నారు.  ఎగ్జిట్ పోల్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాతీయ సంస్థలు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే మెయిన్ ఫలితాలకు దగ్గరగా ఉంటాయని పార్టీలు గట్టిగా భావిస్తున్నాయి. వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎగ్జిట్ పోల్స్ పై కూటమిలో ఆందోళన ఉంది. ఓడిపోతారేమో అనే భయం పట్టుకుంది.చూడాలి ఏమవుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: