ఇండియాహెరాల్డ్ అంచనా: పిఠాపురం విజేత పవనే?

Purushottham Vinay
 2024 ఎన్నికల్లో టాలీవుడ్ పాపులర్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గం పై భారీ అంచనాలు  ఉన్నందు వలన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ అయ్యింది. అక్కడ పవన్ కి గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇది పవన్ కళ్యాణ్ సొంతగడ్డగా ఇంకా ఇక్కడ ఆయన జనసేన పార్టీకి జనాల నుంచి గణనీయమైన మద్దతు ఉంది. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి ముఖ్యమైన అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ పోటీ చేసి తన ప్రసంగాలతో ప్రజలని ఎంతగానో ఆకట్టుకొని పిఠాపురంలో ప్రజాదరణ పొందారు. పిఠాపురంలో YSRCP అధికారంలో ఉన్నప్పటికీ పవన్ ఆ ప్రాంతం నుండి పోటీ చేయడం అతని విజయ అవకాశాలను పెంచుతుంది. పైగా పిఠాపురం స్థానిక అంశాలు, కుల సమీకరణాలు కూడా ఆయనకు మద్దతునిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలో చురుగ్గా ప్రచారం చేశారు. ఆయన స్టార్ చరిష్మా మరియు జనాల్లో  పాపులారిటీ అనేవి ఆయనకి అడ్వాంటేజ్‌గా మారాయి.


అయితే, వైఎస్సార్‌సీపీ కూడా పిఠాపురం సీటును నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. వైసీపీ వారు కూడా పవన్ కళ్యాణ్‌పై గట్టిగా పోటీ చేస్తున్నారు. పిఠాపురం ప్రాంతంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఉన్న ప్రజాదరణ, స్థానిక అంశాల వల్ల ఆయనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. మరియు విస్తృత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం సీటును గెలుచుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని ఇండియా హెరాల్డ్ అంచనా వేస్తుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కి వంగ గీత నుంచి గట్టి పోటీ ఉంది. కానీ పిఠాపురంలో ప్రస్తుతం కళ్యాణ్‌కు అనుకూలంగా వాతావరణం కనిపిస్తోంది. ఆయన ఖచ్చితంగా పిఠాపురంలో గెలిచి తన తొలి అసెంబ్లీ సీటును గెలుస్తారని ఇండియా హెరాల్డ్ అంచనా. ఆయన ఫ్యాన్స్ కూడా పిఠాపురంలో గెలుస్తారని భారీ అంచనాలు పెట్టుకున్నారు.మరి చూడాలి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన గెలుపు జెండాని పిఠాపురం నియోజకవర్గంలో ఎగర వేస్తారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: