జగన్‌ మార్క్‌: ఆ జిల్లాలో క్లీన్ స్వీప్.. తొమ్మిదికి తొమ్మిదీ !

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అందరి చూపు ఫలితాల పైన ఉంది. మరో వారం పది రోజుల్లోనే ఈ ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా పార్లమెంటు ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా అన్ని సెంటర్లలో కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇలాంటి ఇబ్బందులు లేకుండా కౌంటింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇలాంటి నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ప్రకటించారు. జగన్ మార్క్ పాలనలో ఇది సాధ్యమని తెలిపారు. విజయనగరంలో తొమ్మిదికి తొమ్మిది.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 175 కి 175 గెలుస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రజలకు గుమ్మం ముందితే పాలన తీసుకువచ్చామని తెలిపారు.
వలంటీర్ వ్యవస్థను అమలు చేశామని.... చాలా మంచి పేరు వచ్చింది. తద్వారా చాలా రాష్ట్రాల వలంటీర్ వ్యవస్థను అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేశామని... ఎన్నికల్లో చంద్రబాబు మిమిక్రీ చేశాడని ఫైర్‌ అయ్యారు. ఫించన్ డబ్బులు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ కు లేఖ రాశాడని పేర్కొన్నారు. చేయూత పథకాన్ని అడ్డుకున్నారని ఆగ్రహించారు. పేద వారికి సంక్షేమం అండకూడదనేది చంద్రబాబు నైజం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ..
ఆరోపించడం టీడీపీకి అలవాటేనని... విశాఖలో కొంతమంది మీద దాడి జరిగితే దానికి రాజకీయ రంగు పులుమారని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. కూటమి నేతలు ఎక్కువగా పోటీ చేసిన ఆ నాలుగు జిల్లాల్లోనే ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేశారని ఆరోపణలు చేశారు దానికి కారణం వారి చేసిన ఘటనలేనని... మా నాయకుడు చెప్పేసి వెళ్ళాడు. కానీ చంద్రబాబు, ఆయన కుమారుడు చెప్పకుండానే విదేశాలకు వెళ్ళిపోయారని చురకలు అంటించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి వాతావరణం లేదని... అల్లర్లు, దాడులు వంటి ఘటనలు కొనసాగించకూడదని కోరుతున్నానని కోరారు మంత్రి బొత్స సత్యనారాయణ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: