రాజమండ్రి : గెలుపు ధీమాపై లెక్కలేసుకుంటున్న చిన్నమ్మ..!

FARMANULLA SHAIK
* ఎంపీగా గెలుపు ధీమా పై లెక్కలేసుకుంటున్న పురంధేశ్వరి
* కూటమిలో భాగంగా బత్తుల బాలరామకృష్ణకు అనుకూల పవనాలు వీస్తున్నాయి

(రాజమండ్రి -ఇండియా హెరాల్డ్ ) :
రాజమండ్రి పార్లమెంట్‌ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి గెలుపు ధీమాతో ఉన్నారు. మరియు వైసీపీ నుంచి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ మొదటిసారిగా ఎన్నికల రంగంలోకి దిగారు.అయితే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మార్గాని భరత్‌ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఈ ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టిక్కెట్‌ కాకుండా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. గతంలో వైసీపీ సిటీ కో ఆర్డినేటర్‌గా ఉన్న గూడూరి శ్రీనివాసులును ఎంపిగా రంగంలోకి దించింది.త్రిముఖ పోటీలో భాగంగా కాంగ్రెస్ నుండి మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా తన బలాన్ని నిరూపించుకోవాలనే లక్ష్యంతో బాగా కష్టపడ్డారు కచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు పడే అవకాశం ఉంది.కూటమిలో భాగంగా బిజెపి నేతలు చంద్రబాబును ఒప్పించి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరిని ప్రకటించేలా చేశారు.గతంలో రెండుసార్లు బిజెపి నుండి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులు గెలిచారు.

రాజమండ్రి పార్లమెంట్ కింద ఉన్న ఏ నియోజకవర్గాల విషయానికి వస్తే అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం పట్టణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు ఉన్నాయి.గోపాలపురం నుంచి తానేటి వనిత, రాజమండ్రి రూరల్‌ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు పోటీలో ఉన్నారు. వీరిద్దరూ మంత్రులు అయితే వీరు ఈ ఎన్నికల్లో ఎదురీదుతున్నాని ప్రచారం జరుగుతోంది. రాజానగరంలో జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి జక్కంపూడి రాజా పోటీలో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో జక్కంపూడి రాజాకు కూడా కష్టకాలమేననే ప్రచారం సాగుతోంది. జనసేన అభ్యర్థి బలరామకృష్ణకు గెలుపు అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నిడదవోలులో కూడా కందుల దుర్గేష్‌కు అనుకూల పవనాలు వీస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పోలింగ్‌లోనూ జెఎస్‌పి అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు పోలయినట్లు స్థానికులు చెబుతున్నారు.ఈ పరిస్థితులను బట్టి పరిశీలిస్తే దగ్గుబాటి పురందేశ్వరి గెలుపు బాటలో ఉన్నారనే చర్చ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: