కేసీఆర్ ఆయుధం వాడేసిన జగన్.. చంద్రబాబు గజగజ..??

Suma Kallamadi
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ 2019లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సింది పోయి 2018 లోనే ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికలుగా ఇవి జరిగాయి. జాతీయ రాజకీయాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండేందుకు ఆయన అలా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీడీపీ వాళ్లందరూ కలిసి కేసీఆర్‌ను ఓడించడానికి చాలానే కుట్రలు పన్నారు. వాళ్లు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు చాలానే ప్రయత్నించారు. అయితే "ఒక బక్కొడిని కొట్టేందుకు ఇంతమంది ఏకమయ్యారు, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వీరంతా ఏకతాటి పైకి వచ్చారు, వీళ్ళని నమ్మొద్దు" అని కేసిఆర్ తన ప్రసంగాలలో వినిపించారు.
ఈ బక్కొడిని కొట్టడానికి ఇంత మందా? అంటూ ఆయన పదేపదే తన ప్రసంగాలలో ఒక మాటను హైలైట్ చేశారు. అది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఆయన ప్రసంగాలు కూడా బాగా హిట్ అయ్యాయి. కెసిఆర్ కు ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. ఒక గుంపుగా ఏర్పడిన పార్టీలను గుంటనక్కలాగా చూసి ప్రజలు వారికి ఓట్లు వేయలేదు. బక్కోడు అనే అస్త్రం వాడటం ద్వారా ప్రజలు ఇతరులను నమ్మకుండా కేసీఆర్ ఆపగలిగారు. ఏపీ సీఎం జగన్ కూడా సేమ్ ఇదే అస్త్రాన్ని ఉపయోగించారు ఆయన "నన్ను ఒక్కడిని" అనే పదాన్ని బాగా ప్రజల్లోకి తీసుకుపోయారు. ఈ ఒక్కడిని ఓడించడానికి ఇంతమంది కుట్రలు పన్నుతున్నారని పదేపదే చెబుతూ వచ్చారు.
ఈనాడు, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి టీవీ 5లాంటి వాళ్ళందరూ దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కేంద్రం నుంచి మోదీ కూడా దిగి తనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని సానుభూతి వచ్చేలా మాట్లాడారు. పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం తాను మాత్రమేనని, భారతదేశం మొత్తంలో తాను అందించిన సంక్షేమ పథకాలు ఎవరూ అందించలేదని చెప్పుకొచ్చారు. పేదలకు మంచి చేసే తనని దింపేందుకు ఒక చంద్రముఖి, ఒక దత్త పుత్రుడు ఏకమయ్యారని ప్రసంగాలలో బలంగా చెప్పారు. అవి జనాల్లోకి బాగా వెళ్లి ఉండొచ్చు, ఈసారి ఆ ఆయుధమే జగన్ గెలుపుకు కారణం కూడా కావచ్చు. జూన్ 4వ తేదీన ఆ సంగతి తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: