ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీకి హీరోయిన్ సెట్.. ఆ లక్కీ ఫెలో ఎవరంటే..?

lakhmi saranya
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ  మరియు అతిలోక సుందరి కూతురు అయినా జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.  ఇక ఈ మూవీ అనంతరం తారక్.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇక ఈ మూవీ పవర్ హౌస్ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ ఈ చిత్ర బృందం నిన్న ఓ మెసేజ్ ను పోస్ట్ చేసింది. ఇక‌ తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరొక క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించబోతున్నట్లు సమాచారం. మరి కియారా అద్వానీ నిజంగానే ఎన్టీఆర్ తో జతకట్టనుందా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ మూవీలో మరో హీరోయిన్ కి కూడా ప్లేస్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్రలో మరో బ్యూటీ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రెసెంట్ ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మొత్తానికి ప్రశాంత్ నీల్, తారక్ సినిమా కథపై ఎన్టీఆర్ తో జతకట్టే హీరోయిన్ పై చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఈ వార్తను విని ఆశ్చర్యపోతున్నారు. ప్రజెంట్ కియారా అద్వానీ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ కనుక సూపర్ హిట్ అయితే బాలీవుడ్లో కియారా కి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: