పోలింగ్ త‌ర్వాత కూడా వైసీపీ గేమ్ ప్లాన్ మామూలుగా లేదే...?

RAMAKRISHNA S.S.
పోలింగ్ ముగిసి.. ఏడు రోజులు అయిపోయింది. వాస్త‌వానికి ఇప్ప‌టికే రాష్ట్రంలో పోలింగ్ వేడి త‌గ్గిపోవాలి. ఎవ‌రు గెలుస్తార‌నే చ‌ర్చ రెండు మూడు జ‌రిగినా.. త‌ర్వాత త‌ర్వాత‌.. ఈ వేడి త‌గ్గిపోవ‌డం స‌హ‌జంగానే ఉంటుంది. కానీ, ఏపీలో మాత్రం అలా జ‌ర‌గ‌కుండా .. అధికార పార్టీ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అనేక విశ్లేష‌ణ‌లు రోజూ యూట్యూబ్, స‌హా.. సోష‌ల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పుంఖాను పుంఖానులుగా వ‌స్తూనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఎన్ని విశ్లేష‌ణుల వ‌చ్చినా.. ఏం లాభం అనుకుంటున్నారా?  కానీ.. ఇక్క‌డే వైసీపీ వ్యూహం దాగి ఉంది.

ఎన్నిక‌ల ఫ‌లితం ఎలా ఉన్నా.. ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌ను త‌క్కువ చేసి చూపించ ప్ర‌య‌త్నానికి తాము అడ్డుక‌ట్ట వేయ‌క‌పోతే.. రేపు ఫ‌లితం వ‌చ్చిన త‌ర్వాత‌.. అనుకూలంగా వ‌స్తే.. అంత ఊపు ఉండ‌ద‌ని.. ప్ర‌జ‌ల్లోనూ సంబ‌రాలు జ‌ర‌గ‌వ‌ని వైసీపీ భావిస్తు న్న‌ట్టు తెలుస్తోంది.  అందుకే ఎన్నిక‌ల వేడిని త‌గ్గ‌కుండా చేసేందుకు.. నిత్యం ఏదో ఒక ఛానెల్‌లో పోలింగ్‌పై డిబేట్ పెట్టించ‌డ‌మో.. లేక అనుకూల వ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు చేయించ‌డ‌మో.. విశ్లేష‌ణ‌లు చేయించ‌డ‌మో చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా.. ఓటేసిన వారు.. హ‌మ్మ‌య్య మంచి నేతకే ఓటేశాం.. అని అనుకునేలా చేయ‌డం పాజిటివ్ థింకింగ్ దిశ‌గా వారిని న‌డిపించ‌డం ఇక్క‌డ కీలకం.

ఇదే విష‌యంలో వైసీపీ ఒక‌ర‌కంగా స‌క్సెస్ అయింది. ఇక‌, టీడీపీ ప‌రంగా చూసుకుంటే.. ఇంత జోరుగా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం లేదు. అంతా దాదాపు సైలెంట్‌గానే ఉన్నారు. ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే అడ‌పా ద‌డ‌పా మాట్లాడుతున్నా.. వైసీపీ రేంజ్‌లో అయితే.. ఎవ‌రూ విశ్లేష‌ణ‌లు చేయ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబు చేసిన‌.. ప్ర‌చారం , ప‌వ‌న్ చేసిన ప్ర‌చారం వంటివాటిపై పెద్ద గా చ‌ర్చ‌లేకుండా పోయింది. నిజానికి వైసీపీ అదినేత సీఎంజ‌గ‌న్ ఒక‌వైపు ఒంట‌రి పోరులో ప్రచారం చేశారు. ఈయ‌న‌తో పోల్చుకుంటే.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు దుమ్మురేపారు. కానీ, వీరికి ఇప్పుడు ఎక్క‌డా చ‌ర్చ జ‌ర‌గ‌డం లేదు.

ఎక్క‌డ విన్నా.. ఏది చూసినా.. వైసీపీ గెలుస్తుంది.. వైసీపీనే గెలుస్తుంద‌నే ప్ర‌చారాన్ని.. విశ్లేష‌ణ‌లు, వార్త‌ల రూపంలో ప్ర‌జ‌ల్లో లైవ్‌లో ఉంచ‌డం ద్వారా.. వైసీపీపై ఉన్న ఇమేజ్‌ను త‌గ్గ‌కుండా చూస్తుండ‌డం గ‌మ‌నార్హం. జూన్ 4న ఒక‌వేళ వైసీపీ గెలిస్తే.. ఈ వేడి త‌మ‌కు మ‌రింత క‌లిసి వ‌స్తుంద‌ని.. మంచి నాయ‌కుడిని ఎన్నుకున్నామ‌న్న సంతోషం ఉండ‌డంతోపాటు.. జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాలకు కూడా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు అమోఘంగా ఉంద‌న్న చ‌ర్చ‌ను పెట్టేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న‌ది వైసీపీ లెక్క‌. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డా కూడా.. ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. వేడి త‌గ్గ‌కుండా చూస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: