జగన్ ఫ్లైట్ అందుకే లేట్... ప్రత్యర్ధులకు గట్టి కౌంటర్ పడింది..?

Pulgam Srinivas
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు రెండు, మూడు నెలల నుండి విశ్రాంతి అనేది లేకుండా రాష్ట్రమంతా పర్యటిస్తూ వస్తున్నాడు. మే 13 వ తేదీన ఎలక్షన్లు పూర్తి కావడంతో మళ్లీ రిజల్ట్ రావడానికి కూడా కొన్ని రోజుల సమయం ఉండడంతో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా విదేశాలకు వెళ్లాలి అని ఒక ట్రిప్ ను ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా ఎలక్షన్ల అనంతరం తన కుటుంబంతో కలిసి విదేశాలకు బయలుదేరారు.

ఆయన శుక్రవారం రాత్రి 11 గంటలకు గన్నవరం ఎయిర్‌ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ కి బయలుదేరారు. ఇక జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి బయలుదేరిన ప్రత్యేక విమానం 4 గంటలు ఆలస్యంగా లండన్‌ విమానాశ్రయంలో లాండ్ అయ్యింది. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకి లండన్‌ లోని లూటాన్‌ విమానాశ్రయం లో ఆ విమానం ల్యాండ్‌ కావాల్సి ఉంది.

కానీ కాలేదు దానితో ఎంతో మంది జగన్ ప్రత్యర్థులు జగన్ తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఎందుకు లాండ్ కావడం ఆలస్యం అయింది. మధ్యలో ఆయన ఫ్లైట్ వేరే ప్రాంతానికి ఎందుకు వెళ్ళింది అని రకరకాల ప్రశ్నలు ఆయన ప్రత్యర్ధుల నుండి వచ్చాయి. ఇక తాజాగా వాటన్నింటికీ సమాధానాలు బయటకు వచ్చాయి.

జగన్ ప్రత్యేక విమానం ల్యాండ్ కావడానికి నాలుగు గంటలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్ నుంచి ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడమే. దానితో చేసేదేమీ లేక ఆ విమానం 47 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. అప్పటికి కూడా ఏటీసీ నుంచి పర్మిషన్ రాకపోవడంతో నెదర్లాండ్స్‌ లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానం దిగింది.

దీంతో ఆమ్‌స్టర్‌ డ్యామ్ ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు సీఎం జగన్‌ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఫ్లైట్ ల్యాండింగ్‌కు అనుమతి రావడంతో తిరిగి లండన్‌కు బయల్దేరారు. చివరికి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి లూటాన్‌ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్‌ అయింది.

జగన్‌ కుటుంబం లండన్‌కు వెళ్లేందుకు కొలంబో నుంచి గురువారం విస్టా జెట్‌ కంపెనీకి చెందిన బొంబార్డియర్‌ 7500 విమానాన్ని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కు తెప్పించారు.  లండన్ అక్కడి నుంచి యూకే , స్విట్జర్లాండ్ , ఫ్రాన్స్ వెళ్లి చివరికి ఈ నెల 31 వ తేదీన తిరిగి తాడేపల్లికి జగన్ రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: